శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఎన్ఎస్‌టిఇడిబి, డిఎస్‌టి చేపట్టిన సిఎడబ్ల్యుఎసిహెచ్ చొరవ మద్దతుతో
స్టార్టప్ లు అభివృద్ధి చేసిన కోవిడ్-19 గుర్తింపు కిట్ల ఎంపికకు అవకాశాలు
Posted On:
06 OCT 2020 5:13PM by PIB Hyderabad
నూతనంగా ప్రారంభమైన సంస్థలు (స్టార్టప్‌లు) ప్రస్తుతం కృషి చేస్తున్న కోవిడ్ 19ను గుర్తించే కిట్లు (డిటెక్షన్ కిట్లు) నుంచి మన్నికైనవి ఎంపిక చేసుకునే ప్రత్యామ్నాయం భారత్‌కు త్వరలో అందుబాటులోకి రానుంది.
చిన్న చిన్న ఆసుపత్రులలో, విమానాశ్రయాల ద్వారం వద్ద లేక చిన్న ప్రయోగశాలలు తేలికగా ఉపయోగించగల కిట్లు, వేగంగా యాంటీబాడీ పరీక్షలు చేయడానికి అరచేతిలో ప్రయోగశాల వంటి పరికరంతో పాటుగా కోవిడ్ శాంపుళ్ళగా అనుమానిస్తున్న వాటిలో ప్రత్యక్షంగా యాంటీజెన్ పరీక్షలు చేసేందుకు రీడర్ ఉన్న టెస్ట్ కిట్ వంటివి ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న కిట్లలో కొన్ని మాత్రమే.
కొన్ని స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్ర ప్రభుత్వ మద్దతుతో పునర్నిర్మించి, వాటిని కోవిడ్ -19 ఆరోగ్య సంక్షోభంపై (సిఎడబ్ల్యుఎసిహెచ్) యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు నిర్దేశించారు. ఈ చొరవ నేషనల్ సైన్్స అండ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్ ఎస్ టిఇడిబి), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్్స అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) చేపట్టగా, ఐఐటి బాంబేకు చెందిన సొసైటీ ఫర్ ఇన్నొవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అమలు చేస్తోంది.
వివిధ కోవిడ్ 19 పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు అంతిమంగా ఎంపిక చేసుకున్న 51 కంపెనీలలో, 10 కంపెనీలకు వివిధ చికిత్సా పరిష్కారాలు, రోగలక్షణాలను తెలుసుకునే కిట్లను తయారు చేసి, విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పాటు ఇవ్వడం జరిగింది. రూపొందించిన అనేక సాంకేతిక పరిజ్ఞానాలు ఐసిఎమ్ఆర్ ధృవీకరణ కోసం వేచి ఉన్నాయి. ఆ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అనుమతి ప్రక్రియలను పూర్తి చేసి, మంజూరు చేయడం జరుగుతుంది.
డిఎస్‌టి మద్దతుతో లూప్ మీడియేటెడ్ ఐసోథెర్మల్ ఆంప్లిఫికేషన్ (LAMP) అనే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తక్కువ ధరకే మాలిక్యులార్ కోవిడ్-19 పరీక్షలనునిర్వహించేందుకు ఒమిక్స్ రీసెర్్చ అండ్ డయాగ్నాస్టిక్్స లాబొరేటరీస్ ( OmiX Research and Diagnostics Laboratories) తన ఒమిక్్స -యాంప్ (OmiX-AMP ) వేదికను విస్తరించింది.
నమూనాలను పాజిటివ్ లేదా నెగెటివ్ అని ఖచ్చితంగా గుర్తించే ఆల్గోరిథమ్్స సాయంతో అంతర్గతంగా నిర్మించిన రంగు గుర్తింపు పరికరం ద్వారా లాంప్ (LAMP) పరీక్షలను నిర్వహిస్తారు. వాటిని చిన్న చిన్న క్లినిక్‌లలో, విమానాశ్రయం వంటి రద్దీ ఉండే ప్రవేశ ద్వారాల వద్ద, చిన్న చిన్న లాబొరేటరీలలో ఉంచవచ్చు.
ఒమిక్్స- యాంప్ వేదిక అభివృద్ధి చేసిన లాంప్ సాంకేతిక ఆధారంగా పని చేసే 5 తేలికగా వినియోగించగలిగిన కిట్లు ప్రస్తుతం ఐసిఎమ్ఆర్ ధృవీకరణ కోసం వేచి ఉన్నాయి. మాలిక్యులార్ పరీక్షలలో ఆర్‌టి- పిసిఆర్ (RT-PCR)కు తేలికైన, సరళమైన ప్రత్యామ్నాయాన్ని లాంప్ పద్ధతి అందిస్తోంది. మాలిక్యులార్ పరీక్షలు విస్తృతంగా, ఖచ్చితంగా చేసేందుకు వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశమిస్తుంది.
సాధారణ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండే నిర్ధిష్టత కలిగి, పరీక్షకాలు నింపిన సింగిల్ ట్యూబ్ కిట్్స అందుబాటులోకి రానున్నాయి. నమూనాలను పాజిటివ్ లేదా నెగెటివ్ అని ఖచ్చితంగా గుర్తించే ఆల్గోరిథమ్్సను అంతర్గతంగా నిర్మించిన ఈ పరికరం అతితక్కువ ఖర్చుతో (రూ. 50వేల కన్నా తక్కువ) అందుబాటులోకి రానుంది.
సొసైటీ ఫర్ ఇన్నొవేషన్ అండ్ డెవలప్‌మెంట్, ఐఐఎస్‌సి బెంగళూరులో పథ్‌శోధ్ ఆరోగ్య రక్షణ పేరిట 2015లో అనుపాత్ అన్న పేరుతో రూపొందించిన అరచేతిలో ప్రయోగశాలను (Lab on palm platform) కోవిడ్-19 రాపిడ్ యాంటీబాడీ పరీక్షల కోసం పునరుద్దేశించారు.
పథశోధ్ అసాధారణమైన ప్రత్యేక పరిష్కారం, తిరిగి ఉపయోగించలేని పరీక్ష స్ట్రిప్పులతో ఎలక్ర్టానిక్ రీడర్ ను సంయోగపరచి ఫలితాలను విశ్లేషించడంలో ఇది మానవ తప్పిదాలను తొలగిస్తుంది. అది కేవలం ఐజిజి (IgG) పరీక్షల వలే కాకుండా పూర్తి యాంటీబాడీ పరీక్ష (both IgM and IgG). ఇది మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గుణాత్మక పరీక్షల వలె కాకుండా రోగనిరోధక స్థాయిని అంచనా వేయగల పరిమాణాత్మక పరీక్ష. ఇది 10 నానోమోలార్ సాంద్రత వరకు గుర్తించగలిగే పరిమితిని కలిగి ఉంటుంది. ఈ పరీక్షా ఫలితాలను ఆధార్ నెంబర్‌తోనూ, ఆరోగ్యసేతు ఆప్‌తోనూ అనుసంధానం చేయవచ్చు.
కోడిడ్ -19 (CODID-19)ను ఉత్పత్తి చేయడానికి వారు సిడిఎస్‌సిఓ నుంచి టెస్ట్ లైసెన్సును పొందారు. రక్త నమూనాలలో పెరిగిన కోవిడ్ -19కు యాంటీబాడీల పునర్ఘటనకు సంబంధించిన పరీక్షలను పూర్తిగా ధృవీకరించడం జరిగింది. వాస్తవ రోగుల శాంపుళ్ళతో తొలి ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని పరీక్షలను నిర్వహిస్తారు. వారు తమ పరీక్ష కిట్ ను ఐసిఎంఆర్ ధృవీకరణ, ఆమోదం కోసం అక్టోబర్ 30వ తేదీలోగా సమర్పించేందుకు యోచిస్తున్నారు.
ప్రాంటే సొల్యుషన్స్ ఒపిసి, కోవిడ్ శాంపుళ్ళుగా అనుమానిస్తున్న వాటిని ప్రత్యక్షంగా యాంటిజెన్ పరీక్ష చేసేందుకు రీడర్ అనుసంధానించిన పరీక్షల కిట్‌ను అభివృద్ధి చేసింది. ఇది 100పిజి గాఢత కలిగిన మాంసకృత్తుల పరిమాణాత్మక కొలతను సాధ్యం చేసే లోకలైజ్డ్ సర్ఫేస్ ప్లాస్మన్ రెసొనెన్స్ ఎన్‌హాన్స్‌మెంట్ అనే సాంకేతికపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ సాంకేతిక ఆర్‌టి-పిసిఆర్ కు వేగవంతమైన ప్రత్యామ్నాయం, దీనిని సంరక్షక స్థానంలో మోహరించవచ్చు.
కరోనా వైరస్‌ను గుర్తించేలా తక్షణ వినియోగానికి అనువుగా ఉండే మూడు ఆలిగో మిక్్స కలిగిన కిట్ వి 2.0 హ్యువెల్ లో దాదాపు ఒక ఏడాదిపాటు నిల్వ ఉండే సింగిల్ ట్యూబ్ ఆర్‌టి క్యూపిసిఆర్ ఆంప్లిఫికేషన్ (RT qPCR amplification) కలిగిన రివర్స్ ట్రాన్సి్కప్టేస్ ఎంజైమ్ ఉంటుంది.
చిమేరా ట్రాన్్సలేషనల్ రీసెర్చ్ ఫ్రెటర్నిటీ కోవిడ్ -19 రోగులకు తగిన మోతాదులో ప్రామాణిక ప్లాస్మా డోసేజీని అందించేందుకు సాంకేతికను అభివృద్ధి చేసింది. రోగికి సరైన మోతాదులో డోసును అందించే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. వారు అభివృద్ధి చేసిన ల్యోఫైలైజ్డ్ - కోవిడ్ యాంటీబాడీ రిచ్ ప్రాడక్ట్ (L-CARP), సురక్షితమైన చికిత్సను అందించడమే కాకుండా, స్ర్కీనింగ్ ప్రక్రియ సాయంతో దాతకు ఉన్న ఇన్ఫెక్షన్లు రోగికి బదలాయింపు కాకుండా నివారిస్తుంది. ఆఖరు నిమిషంలో ప్లాస్మాను వెతికి, స్ర్కీనింగ్ చేసి, ఉపసంహరించడంలో జరిగే జాప్యాన్ని నివారించడానికి వారు ఎల్-కార్ప్ బ్యాంక్‌ను అభివృద్ధి చేశారు.
ఐఐటి బాంబే, సినె (SINE), ఐఐటి ఢిల్లీకి, ఎఫ్ ఐఐటి (FIIT), ఐఐటి కాన్పూరు, ఎస్ ఐఐసి (SIIC), ఐఐటి మద్రాస్, హెచ్‌టిఐసి (HTIC), వెంచుర్ సెంటర్, పూణె, ఐకెపి నాలెడ్జ్ పార్క్ హైదరాబాద్, కెఐఐటి -టిబిఐ భుబనేశ్వర్ లు సాంకేతిక పురోగమనంపై తగిన సమయంలో సలహాలు ఇస్తూ స్టార్టప్‌లు అన్ని మార్గదర్శకాలను అనుసరించేలా మార్గనిర్దేశం చేస్తూ, ఎంఒయులపై సంతకాలు చేయడం తదితర కర్తవ్యాలను నిర్వహించాయి.
***
(Release ID: 1662133)
Visitor Counter : 247