ప్రధాన మంత్రి కార్యాలయం

ఇజ్రాయిల్ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ

Posted On: 05 OCT 2020 8:00PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ , ఇజ్రాయిల్ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూతో ఈరోజు టెలిఫోన్‌లో మాట్లాడారు.

యూదుల కొత్త సంవ‌త్స‌రం , అలాగే యూదుల పండుగ సుక్కోట్ సంద‌ర్భంగా ఇజ్రాయిల్ ప్ర‌ధాన‌మంత్రి నెత‌న్యాహూకు ,ఇజ్రాయిల్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ త‌మ హృద‌యపూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఇరువురు నాయ‌కులు  కోవిడ్‌ప‌రిస్థితుల నేప‌థ్యంలో ద్వైపాక్షిక స‌హ‌కారానికి సంబంధించిన పురోగ‌తిని, ప్ర‌త్యేకించి ప‌రిశోధ‌న‌లు, వ్యాధి నిర్ధార‌ణ ప‌రిక‌రాలకుసంబంధించిన క్షేత్ర‌స్థాయి ప‌రీక్ష‌లు, వాక్సిన్ అభివృద్ధి త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ రంగాల‌లో ప‌రస్ప‌ర స‌న్నిహి‌త స‌హ‌కారం ప్రాధాన్య‌త‌పై వారు ప‌ర‌స్ప‌ర అంగీకారం తెలిపారు. ఇది ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ‌డ‌మేకాక‌,మొత్తం మాన‌వాళి విస్తృత ప్ర‌యోజ‌నాల‌కు ప‌నికివ‌స్తుంద‌ని అన్నారు.‌
నీరు, వ్య‌వ‌సాయం,ఆరోగ్యం, వాణిజ్యం, స్టార్ట‌ప్‌లు, ఆవిష్క‌ర‌ణ‌లు త‌దిత‌ర రంగాల‌లో ప్ర‌స్తుతం కొన‌సాగుత్న్న స‌హ‌కారాన్ని వారు స‌మీక్షించారు. ఈ సంబంధాల‌ను మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డం గురించి వారు చ‌ర్చించారు.
ప్రాంతీయంగా, అంత‌ర్జాతీయంగా ఎదుర్కొంటున్న స‌వాళ్ల, ల‌భిస్తున్న అవ‌కాశాల‌పై నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతుండాల‌ని ఇరువురునాయ‌కులు అంగీక‌రించారు.అలాగే అద్భుత ద్వైపాక్షిక వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య మార్గ‌నిర్దేశానికి ఇది అవ‌స‌ర‌మ‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.

***


(Release ID: 1661972) Visitor Counter : 243