గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2030 లో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు స్వీకరించిన సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండా మార్గదర్శక పత్రం - 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డిజిఎస్), 169 లక్ష్యాలు సమిష్టి దృష్టి, గమ్యాలను ప్రతిబింబిస్తాయి: హర్దీప్ ఎస్. పురీ
ప్రపంచ నివాస దినోత్సవం 2020
Posted On:
05 OCT 2020 1:05PM by PIB Hyderabad
ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు 2015 లో ఆమోదించిన 'సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండా' ప్రపంచమంతా నివాసాలు ఏర్పరుచుకున్న ప్రజలకు మార్గదర్శక పత్రం అని, గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ (ఐ/సి) మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పురీ పేర్కొన్నారు. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజి) మరియు 169 లక్ష్యాలు కలిసి, 2030 నాటికి మనం సాధించాల్సిన సమిష్టి దృష్టి, గమ్యం రెండింటినీ ప్రతిబింబిస్తాయి. స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, అర్బన్, స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్ మిషన్ వంటి మనం అమలు చేస్తున్న అన్ని ప్రధాన మిషన్లు సభ్య దేశాలు స్వీకరించిన ఎస్డిజి కన్నా ముందే అమలులో ఉన్నాయి. భారతదేశం లాంటి వైశాల్యం, వైవిధ్యం మరియు జనాభా ఉన్న దేశంలో, ఈ ప్రతిష్టాత్మక పట్టణ ఎజెండాను అమలు చేయడం ఒక సవాలే.
"అయితే, మేము విజయవంతం అవుతామని ఆశాజనకంగాను, నమ్మకంతోను ఉన్నాము. ఇటువంటి గొప్పదైన ఏ ప్రయత్నంలోనైనా విజయవంతం కావడానికి అవసరమైన అంశం బలమైన రాజకీయ సంకల్పం. అది ఈ ప్రభుత్వంలో సమృద్ధిగా ఉంది ”. అని కేంద్ర మంత్రి అన్నారు. ఈ రోజు ఇక్కడ నిర్మన్ భవన్ నుండి 2020 ప్రపంచ నివాస దినోత్సవం సందర్భంగా ఒక వెబినార్‌లో ఆయన ప్రసంగించారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా, యుఎన్ ఏజెన్సీలు, రాష్ట్రాలు మరియు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా వెబినార్‌కు హాజరయ్యారు. 2020 ప్రపంచ నివాస దినోత్సవం సందర్భంగా, మోహువా కింద ఉన్న హడ్కో, బిఎమ్‌టిపిసి సిజిఇవో మరియు ఎన్‌సిహెచ్‌ఎఫ్ సంస్థల యొక్క అనేక ఈ-ప్రచురణలను కూడా ఆవిష్కరించారు.
మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలస రావడం పెద్ద సవాలు అని అన్నారు. దీనిని పరిష్కరించడానికి, పెద్ద ఎత్తున అద్దె గృహాలను అందుబాటులో ఉంచే పథకాన్ని ప్రభుత్వం త్వరగా తీసుకువచ్చింది. పర్యావరణ వ్యవస్థను నిర్దేశించారు మరియు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. కొత్త మరియు పర్యావరణ సురక్షితమైన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాలు మరియు సాంకేతికతలను ఉపయోగించడంపై పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరించాము. పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని అదుపులో ఉంచడంలో ఇది మంచి ప్రభావం చూపుతుంది. గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ద్వారా, జాతీయ మరియు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాలలో అత్యుత్తమమైనవి తీసుకురావాలని ఆశాభావంతో ఉన్నట్టు ఆయన తెలిపారు.
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ కింద సాధించిన విజయాల వివరాలను అందిస్తూ, వ్యక్తిగత మరియు సామజిక మరుగుదొడ్ల లక్ష్యాలను చేరుకోవడమే కాక, 2 అక్టోబర్ 2019 నాటికి అధిగమించామని మంత్రి అన్నారు. ఇది నిజంగా మహాత్మునికి ఎవరైనా చెల్లించగల ఉత్తమ నివాళి అని అన్నారు. మరుగుదొడ్డి చుట్టూ కథాంశం ఉన్న రెండు సినిమాలు కూడా తయారయ్యాయి! పరివర్తన అలాంటిది, అన్నారాయన.
సాంకేతిక పరిజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి, స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది అని శ్రీ పురీ అన్నారు. అందువల్ల, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు (ఐసిసిసిలు) కీలకమైన మునిసిపల్ విధులను రియల్ టైం ప్రాతిపదికన పర్యవేక్షిస్తుండగా, నగరమంతటా విస్తృతంగా ఏర్పాటయ్యే సిసిటివిల వల్ల పౌరులు, మరీ ముఖ్యంగా మహిళలు భద్రత విషయంలో ధైర్యం పెరిగిందని ఆయన చెప్పారు. ఈ స్మార్ట్ సిటీలలో నేరాల రేట్లు గణనీయంగా తగ్గుతున్నట్లు ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయన్నారు.
"ఈ రోజు కోవిడ్ -19 ప్రపంచ గమనపు ఒరవడిని వేగవంతం, తీవ్రతరం చేసింది. యథాతథ స్థితి దెబ్బతింది మరియు ముఖ్యంగా, ప్రపంచం ఆత్మపరిశీలన చేసుకునే స్థితిలో తనకు తాను గతిని సరి చేసుకోవాల్సి వస్తోంది. 1.35 బిలియన్ల జనాభా ఉన్న భారతదేశానికి, సవాళ్లు పెద్దవిగా ఉన్నాయి. అదృష్టవశాత్తూ రాజకీయ నాయకత్వం, కేంద్రంలోని అధికార యంత్రాంగం, రాష్ట్రాలు మరియు జిల్లాలు ఈ పరిస్థితిని తట్టుకునే స్థాయికి ఎదిగాయి. ఆరోగ్య నిపుణులు మరియు కార్మికుల నేతృత్వంలోని ఫ్రంట్ లైన్ యోధులు ముందు ఉండి నాయకత్వం వహించారు. కానీ భారతదేశం స్థితిస్థాపకంగా ఉంది. మనం ఈ మహమ్మారి నుండి ధైర్యస్థైర్యాలతో బయటపడతాం. మన నగరాలు సరైన పాఠాలు నేర్చుకుంటాయని, మంచి భవిష్యత్తు కోసం మన నగరాలు సంసిద్ధం అవుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ”అని శ్రీ పురీ అన్నారు.
*****
(Release ID: 1661850)
Visitor Counter : 411