రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'స్మార్ట్‌' ప్రయోగం విజయవంతం

Posted On: 05 OCT 2020 1:26PM by PIB Hyderabad

'సూపర్‌సోనిక్‌ మిస్సైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టోర్పెడో' (స్మార్ట్‌) ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని వీలర్‌ ద్వీపం నుంచి ఉదయం 11.45 గం.కు ప్రయోగం జరిగింది. క్షిపణి పరిధి, ఎగిరిన ఎత్తు, ముందు భాగం విడుదల, టోర్పెడో విడుదల, వేగ నియంత్రణ వ్యవస్థ సహా ప్రయోగంలోని అన్ని దశలు అంచనాలకు తగ్గట్లుగా సమర్థంగా పని చేశాయి.

    తీరం వెంబడి ఉన్న పర్యవేక్షక కేంద్రాలు (రాడార్లు, ఎలెక్ట్రో ఆప్టికల్‌ వ్యవస్థలు), తక్కువ పరిధి ఓడలు, టెలిమెట్రీ కేంద్రాలు ప్రయోగంలోని అన్ని దశలను పర్యవేక్షించాయి.

    స్మార్ట్ అనేది క్షిపణి సాయంతో విడుదలయ్యే తేలికపాటి జలాంతర్గామి విధ్వంసక టోర్పెడో వ్యవస్థ. టోర్పెడో పరిధికి మించివున్న జలాంతర్గామి విధ్వంసక యుద్ధ కార్యకలాపాల్లో వినియోగిస్తారు. జలాంతర్గామి విధ్వంసక యుద్ధ కార్యకలాపాల్లో మన దేశ సత్తాను ఈ ప్రయోగం చాటింది.

    డీఆర్‌డీఎల్‌, ఆర్‌సీఐ హైదరాబాద్‌, ఏడీఆర్‌డీఈ ఆగ్రా, ఎన్‌ఎస్‌టీఎల్‌ విశాఖపట్నం కలసి, స్మార్ట్‌కు అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేశాయి.

    ప్రయోగాన్ని విజయవంతం చేసిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.

    జలాంతర్గామి విధ్వంసక యుద్ధ కార్యకలాపాల తీరును మార్చే సాంకేతికతగా స్మార్ట్‌ను డీఆర్‌డీవో ఛైర్మన్‌ డా.జి. సతీష్‌ రెడ్డి అభివర్ణించారు.

***
 (Release ID: 1661725) Visitor Counter : 270