సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
గాంధీజీ ఇప్పుడు ఉండి ఉంటే, అన్నదాతకు సాధికారత కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదించిన కొత్త వ్యవసాయ చట్టాలను చూసి ఎంతో సంతోషపడి ఉండేవారు : డాక్టర్ జితేంద్ర సింగ్
గ్రామ, వ్యవసాయ కేంద్రిత బాపూ దార్శనికతకు కొత్త వ్యవసాయ చట్టాలు ప్రతిరూపం : డాక్టర్‌జితేంద్ర సింగ్
Posted On:
02 OCT 2020 6:26PM by PIB Hyderabad
మహాత్మాగాంధీకి వ్యవసాయం, గ్రామీణ సుసంపన్నత వంటివి ఎంతో ఇష్టమైన అంశాలు కనుక,ప్రస్తుతం
కేంద్రప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ చట్టాలను చూసి మహాత్మాగాంధీ ఎంతో సంతోషపడి ఉండే వారని కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ సహాయ (స్వతంత్ర)మంత్రి , ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, సిబ్బంది వ్వవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు,అణుఇంధనం, అంతరిక్షశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు మహాత్ముడి గ్రామ,వ్యవసాయ కేంద్రిత దార్శనికతను 70 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం ప్రస్తుత శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసిందని ఆయన అన్నారు. గత ఆరు సంవత్సరాలలో కేంద్రప్రభుత్వం ఎన్నో రైతు అనుకూల చర్యలను చేపట్టిందని ఆయన చెప్పారు, వేప పూత పూసిన యూరియా, భూసారకార్డులు, కిసాన్‌క్రెడిట్ కార్డులు, పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ భీమా యోజన, వంటి ఈ చర్యలన్నీ భారత వ్యవసాయ రంగాన్ని ప్రజాస్వామీకరించడానికి ఉద్దేశించినవని ఆయన అన్నారు. ఇవి తొట్టతొలిసారిగా రైతుకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఇస్తున్నాయని ఆయన అన్నారు.

సుసంపన్నతకు కీలకం-స్వచ్ఛతతో మహాత్మాగాంధీ ప్రయోగాలు అనే అంశంపై ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ , కొత్త వ్యవసాయ చట్టాలు భారతీయ వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఊపు నిస్తాయని అలాగే రైతుల రాబడి రెట్టింపు అయ్యేందుకు ఉపకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి రోజున న్యూఢిల్లీలో కేంద్రీయ భండార్, సెంటర్ ఫర్ స్ట్రాటజీ, లీడర్‌షిప్‌లు ఏర్పాటు చేశాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన స్వచ్ఛభారత్ అభియాన్ గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, ఒక నాయకుడు ప్రారంభించిన కార్యక్రమం కొద్ది వారాలలోనే ప్రజాఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి ప్రపంచంలోనే ఇదోక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. విద్యారంగంలోని వారు పరిశోధన చేయడానికి ఇది మంచి అంశమని ఆయన అన్నారు.
స్వచ్ఛత తర్వాత ఫిట్‌నెస్ గురించి కూడా గాంధీజీ ప్రస్తావించారని, నరేంద్ర మోదీ ప్రభుత్వం దానినికూడా పూర్తి చేసిందన్నారు. 2014 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి,21 జూన్‌ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, 177 దేశాలు ఈ డిక్లరేషన్‌కు కో స్పాన్సరర్లుగా ఉన్నారన్నారు.

బాపూజీ కలలను సాకారం చేసే ప్రక్రియ 70 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ప్రారంభమైందని డాక్టర్ జితేంద్ర అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందుగా లాక్‌డౌన్ ప్రకటించడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గత ఆరు సంవత్సరాల కాలంలో చేపట్టిన స్వచ్చతా అభియాన్ వ్యక్తిగత, కమ్యూనిటీ పరిశుభ్రతా చర్యలకు పెద్ద ఊపు నిచ్చిందని ఆయన అన్నారు. ఇది దేశంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని చెప్పారు.కరోనా కళ్లు తెరిపించిందని, బాపూజీ అత్యంత ముఖ్యమైన సిద్ధాంతమైన పరిశుభ్రత ప్రాధాన్యతను ఇది తెలియజెప్పిందని ఆయన అన్నారు.
ఆత్మనిర్భర్ అబియాన్ లేదా స్వావలంబిత భారత్ అనేది కూడా గాంధీజీ ఆలోచన అయిన స్వరాజ్‌కు కాస్తమార్పులు చేసి రూపొందించినదే నని ఆయన అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో వెదురును ప్రోత్సహించేందుకు ఎంత ప్రాధాన్యత నిస్తున్నదో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టేతెలుస్తుంది. దేశంలోని వెదురు పరిశ్రమ,ఫర్నిచర్‌పరిశ్రమను, అగర్‌బత్తీ, హస్తకళా రంగాలకు సహాయపడేందుకు వెదురు ముడి దిగుమతులపై 25 శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది.
ప్రస్తుత ప్రభుత్వంలో కేంద్రీయ భండార్ కొత్త పని సంస్కృతిని అనుసరిస్తున్నందుకు కేంద్రీయ భండార్‌ను డాక్టర్‌జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ సంస్థ టర్నోవర్ 2017 నవంబర్‌లో 750 కోట్ల రూపాయలు ఉండగాప్రస్తుతం అది 1717 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. మూడేళ్ల వ్యవధిలో టర్నోవర్ రెట్టింపు కంటే ఎక్కువ అయిందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో వినూత్న చర్యలు చేపట్టినందుకు కేంద్రీయ భండార్ ఎం.డీ శ్రీ ముఖేష్ కుమార్‌ను మంత్రి అభినందించారు.ఆహారపదార్ధాలు,కరోనా కిట్లు అందించడంద్వారా సంస్ధ రాబడి పెంచడంతో పాటు ప్రజలవిశ్వాసాన్ని పొందడానికి కృషి చేశారన్నారు.
కేంద్రీయ భండార్ ఛైర్‌పర్సన్ శ్రీమతి పరమేశ్వరిబాగ్రి , కేంద్రీయ భండార్ ఎం.డి . శ్రీ ముఖేష్‌కుమార్, దూరదర్శన్ డైరక్టర్ జనరల్ శ్రీమయాంక్ అగర్వాల్, సెంటర్ ఫర్ స్ట్రాటజీ , లీడర్‌షిప్ డైరక్టర్,ఛీఫ్ ఎక్సిక్యుటివ్ శ్రీవికాస్ శర్మ, , నేషనల్ బుక్ ట్రస్ట్ డైరక్టర్ లెఫ్టినెంట్ కల్నల్‌యువరాజ్ మాలిక్ తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు.
***
(Release ID: 1661257)
Visitor Counter : 135