రైల్వే మంత్రిత్వ శాఖ
వస్తు రవాణా ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధిక ఆదాయాన్ని సాధించిన భారతీయ రైల్వేలు
సెప్టెంబర్ నెలలో వస్తు రవాణాద్వారా భారతీయ రైల్వేలకు వచ్చిన ఆదాయం రూ. 9896.86 కోట్లు
గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ. 1180.57 కోట్లు ఎక్కువ
వస్తు రవాణా ఆదాయంలో 13. 54 శాతం పెరుగుదల
గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే వస్తు రవాణాలో 15. 3 శాతం పెరుగుదల.
లోడింగులోను, ఆదాయంలోను వృద్ధి.
మండలి స్థాయిల్లో వ్యాపారాభివృద్ధి యూనిట్ల ఏర్పాటు కారణంగా, ప్రత్యేక పార్సిల్, కిసాన్ రైళ్ల కారణంగాను, నిరంతర పర్యవేక్షణ కారణంగాను పెరిగిన వృద్ధి
రైల్వేల్లో వస్తు రవాణాపట్ల ప్రజల్లో ఆదరణ పెరగడంకోసం పలు మినహాయింపులు, డిస్కౌంట్లను ప్రకటించిన భారతీయ రైల్వేలు.
Posted On:
01 OCT 2020 5:30PM by PIB Hyderabad
కోవిడ్ సంబంధిత సవాళ్లు అనేకం వున్నప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో భారతీయ రైల్వేలు గణనీయమైన స్థాయిలో ఆదాయాలు సాధించాయి. సెప్టెంబర్ నెలలో వస్తు రవాణాద్వారా భారతీయ రైల్వేలకు వచ్చిన ఆదాయం రూ. 9896.86 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయంతో ( రూ.8716.29 కోట్లు) పోలిస్తే ఇది రూ. 1180.57 కోట్లు ఎక్కువ. వస్తు రవాణా ఆదాయంలో పెరుగుదల 13. 54 శాతం.
భారతీయ రైల్వేల వస్తు రవాణాలో పెరుగుదల అనేది దేశంలో పెరుగుతున్న ఆర్ధిక కార్యకలాపాలను ప్రతిఫలిస్తోంది.
వస్తు రవాణా పెరుగుదల కోసం భారతీయ రైల్వేలు యుద్ధ ప్రాతిపదికన చేసిన చర్యల కారణంగా ఈ విజయం సాధించడం జరిగింది. గత ఏడాదితో ఇదే సమయాన్ని పోలిస్తే లోడింగులోను, ఆదాయంలోను గణనీయమైన పెరుగుదల కనిపించింది. వస్తు రవాణాలో వచ్చిన పెరుగదల 15.35 శాతంగా నమోదైంది.
వస్తు రవాణాలో వచ్చిన మార్పులను సంస్థాగతం చేసి రాబోయే కాలపట్టికలో పొందుపరచాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి. రైల్వేల్లో వస్తు రవాణాపట్ల ప్రజల్లో ఆదరణ పెరగడంకోసం పలు మినహాయింపులు, డిస్కౌంట్లను భారతీయ రైల్వేలు ప్రకటించాయనే విషయం ఇక్కడ గమనార్హం. కోవిడ్ -19 ద్వారా తలెత్తిన పరిస్థితులను అవకాశంగా మార్చుకొని అన్ని అంశాల్లో సామర్థ్యాలను పెంచుకోవడానికి భారతీయ రైల్వేలు చేసిన ప్రయత్నం విజయవంతమైంది.
*****
(Release ID: 1661244)
Visitor Counter : 251