రక్షణ మంత్రిత్వ శాఖ
సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ బాధ్యతలు
प्रविष्टि तिथि:
02 OCT 2020 12:27PM by PIB Hyderabad
పశ్చిమ వైమానిక దళ స్థావరం ప్రధాన కార్యాలయం సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.
1984 డిసెంబర్ 21వ తేదీన, యుద్ధ విమాన పైలెట్‌గా ఆయన సేవలు ప్రారంభమయ్యాయి. మిగ్-21, మిరేజ్-2000 విమానాలను నడిపారు. తర్వాత, ఫ్లైయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ కోర్సు, ఎక్స్‌పెరిమెంటల్ ప్లైట్ టెస్ట్ కోర్సు, దక్షిణాఫ్రికాలో స్టాఫ్ కోర్సు చేశారు. నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌లో విధులు నిర్వర్తించారు. వైమానిక కేంద్రం కమాండెంట్‌గా బాధ్యతలు పూర్తి చేశారు. వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్‌లోనూ సేవలందించారు. వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టేముందు, ఎయిర్ స్టాఫ్ అసిస్టెంట్ చీఫ్ (ప్రణాళికలు)గానూ విక్రమ్ సింగ్ పని చేశారు.
***
(रिलीज़ आईडी: 1661000)
आगंतुक पटल : 166