ప్రధాన మంత్రి కార్యాలయం
అక్టోబర్ 2 న వైభవ్ సమ్మేళనాన్నిప్రారంభించనున్న ప్రధానమంత్రి
Posted On:
01 OCT 2020 9:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ ( వైభవ్) సమ్మేళనాన్ని అక్టోర్ 2 వతేదీ సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.
వైభవ్ సమ్మేళనం ,అంతర్జాతీయ వర్చువల్ సమ్మేళనం.ఇందులో దేశ,విదేశాలలోని భారతీయ పరిశోధకులు,అకడమీషియన్లు పాల్గొంటారు. దీనిని అక్టోబర్ 2, 2020 నుంచి 31 అక్టోబర్ 2020 వరకు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అకడమిక్ సంస్థలలో, పరిశోధన,అభివృద్ధి సంస్థలలో పనిచేస్తున్న భారతీయ మేధావులను,దేశంలో పనిచేస్తున్న మేధావులను ఒక వేదికమీదికి తీసుకువచ్చి పరస్పర సహకారానికి సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటుచేయడం, దేశంలో విద్య, శాస్త్ర,సాంకేతిక రంగాల పునాదిని అంతర్జాతీయ అభివృద్ధికి బలోపేతం చేయడం దీని లక్ష్యం.
ఈ కార్యక్రమ ప్రారంభం అనంతరం ఆన్‌లైన్ చర్చలు జరుగుతాయి. విదేశాలలోని మేధావులు, భారతీయ మేధావులు నెలరోజులపాటు వివిధ వెబినార్లు, వీడియో కాన్ఫరెన్సు ల ద్వారా పరస్పర సంప్రదింపులు జరుపుతారు. 3000 మందికి పైగా విదేశాలలోని 55 కు దేశాలకు చెందిన భారత సంతతి అకడమీషియన్లు, 10 వేలమంది రెసిడెంట్ అకడమీషియన్లు,శాస్త్రవేత్తలు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రవిజ్ఞాన సలహాదారు నాయకత్వంలో సుమారు 200 అకడమిక్ సంస్థలు, శాస్త్ర విజ్ఞాన విభాగాలు నెలరోజులపాటు దీనిని నిర్వహిస్తాయి.
40దేశాలకు చెందిన 1500 మంది పేనలిస్టులు, 200 ప్రముఖ భారతీయ పరిశోధన, అభివృద్ధి సంస్థలు 18 రంగాలలో 80 అంశాలపై వర్చువల్ విధానంలో చర్చలు జరుపుతాయి. ముగింపు సమావేశం అక్టోబర్ 31, 2020 సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహిస్తారు.
***
(Release ID: 1660856)
Visitor Counter : 144
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam