హోం మంత్రిత్వ శాఖ

పునఃప్రారంభానికి హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు

పాఠశాలల ప్రారంభానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ

కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని కార్యకలాపాలకు అవకాశం

కంటెయిన్మెంట్ జోన్లలోఅక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ నిబంధనల అమలు కఠినతరం

Posted On: 30 SEP 2020 7:56PM by PIB Hyderabad

కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి అనుమతిస్తూ హోం మంత్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మార్గదర్సకాలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. పునఃప్రారంభమయ్యే కార్యకలాపాల ప్రక్రియకు మరింత గడువు పెంచారు. ఈ రోజు జారీచేసిన ఈ కొత్త మార్గదర్శకాలు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి వచ్చిన స్పందనకు అనుగుణంగాను, విస్తృతమైన సంప్రదింపుల ద్వారా ఆయా కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు సేకరించిన అంశాల ఆధారంగా రూపొందించినవే.

కొత్త మార్గదర్శకాలలో ముఖ్యాంశాలు:

 కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల 2020 అక్టోబర్ 15 నుంచి అనుమతించే కార్యకలాపాలు

సినిమా హాళ్ళు/థియేటర్లు/ మల్టిప్లెక్స్ లు 50 శాతం సీట్ల సామర్థ్యానికి లోబడి మాత్రమే తెరవటానికి అనుమతించారు. ఇందుకు సంబంధించి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ విడిగా ప్రామాణిక ఆచరణావిధానాలు జారీచేస్తుంది.

రెండు వ్యాపార కార్యకలాపాల మధ్య సాగే ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవటానికి అనుమతిస్తారు. దీనికి సంబంధించి ప్రామాణిక ఆచరణావిధానాలను వాణిజ్య మంత్రిత్వశాఖ విడిగా జారీచేస్తుంది.

క్రీడాకారుల శిక్షణకు సంబంధించిన ఈత కొలనులు ప్రారంభించటానికి అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రామాణిక ఆచరణ విధానాలను యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ విడిగా జారీచేస్తుంది.

వినోద పార్కులు తదితర ప్రదేశాలు ప్రారంభించటానికి అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రామాణిక ఆచరణ విధానాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడిగా జారీ చేస్తుంది..

పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్ సంస్థల ప్రారంభం

పాఠశాలలు, కోచింగ్ సంస్థలను అక్టోబర్ 15 తరువాత ఒక క్రమ పద్ధతిలో ప్రారంభించే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను  రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కల్పించారు. ఆయా పాఠశాలౌ, సంస్థల యాజమాన్యాలతో చర్చించిన మీదట తగిన నిర్ణయం తీసుకోవచ్చు. పరిస్థితిని అంచనా వేసిన మీదట ఈ దిగువ పేర్కొన్న అంశాల ఆధారంగా నిర్ణయించవచ్చు:

ఆన్ లైన్ / దూరవిద్యా విధానంలో బోధన కొనసాగటానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించవచ్చు    

ప్రస్తుతం ఆన్ లైన్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్న పక్షంలో కొంతమంది విద్యార్థులు అదే పద్ధతిలో తరగతులకు హాజరు కాదలచుకున్నప్పుడు వారికి ఆ వెసులుబాటు కల్పించవచ్చు.

విద్యార్థులు పాఠశాలలు / విద్యా సంస్థలకు తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితో మాత్రమే హాజరుకావచ్చు.

హాజ్రు తప్పనిసరి అనే నిబంధన పెట్టకూడదు. తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి.

పాఠసాలలు / విద్యాసంస్థల పునఃప్రారంభానికి తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన ముందు జాగ్రత్తల విషయంలో ప్రామాణిక ఆచరణ విధానాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే రూపొందించుకోవాలి. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ, సాక్షరతా విభాగం, విద్యా మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా వాటి రూపకల్పన జరగాలి.  

ప్రారంభానికి అనుమతించిన పాఠశాలలు  తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ జారీ చేసిన ప్రామాణిక ఆచరణ విధానాలు పాటించాలి.

ఉన్నత విద్యాశాఖ, విద్యా మంత్రిత్వశాఖ కళాసాలలు, ఉన్నత విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు. ఇది అక్కడి పరిస్థితి అంచనా వేసుకున్న మీదట జరగాలి. ఆన్ లైన్/దూరవిద్యా విధానంలో బోధన జరగటాన్ని వీలైనంత వరకు ప్రాధాన్యతా క్రమంలో ప్రోత్సహించాలి.

అయితే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనా(పిహెచ్ డి)  విద్యార్థులు, పోస్ట్  గ్రాడ్యుయేట్ విద్యార్థులతో కూడిన ఉన్నత విద్యా సంస్థలలో లేబరీటరీలు, ప్రయోగశాలల అవసరం ఉంటుంది గనుక వాటిని ఈ దిగువ పేర్కొన్న విధంగా అక్టోబర్ 15 తరువాత ప్రారంభించుకోవచ్చు:

కేంద్ర నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థల విషయంలో  సైన్స్, టెక్నాలజీ పరిశోధక విద్యార్థులకు ప్రయోగశాలల వాడకం అవసరమని సంస్థ అధిపతి నిజంగా అవసరముందని తనకు తాను సంతృప్తి చెందిన పక్షంలో అనుమతించవచ్చు.

గుమికూడటంపై నియంత్రణ

సామాజిక/విద్యాపరమైన/ క్రీడా/వినోద /సాంస్కృతిక/ మతపరమైన/రాజకీయ కార్యక్రమాలు, తదితర సామూహిక కార్యక్రమాలకు కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల 100 మందికి మించకుండా  ఇప్పటికే అనుమతి మంజూరు చేయటమైనది. ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అక్టోబర్ 15 తరువాత  కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల 100 మందికి మించి కూడా అనుమతించటానికి అవకాశం ఇవ్వబడింది. అయితే, ఈ దిగువ పేర్కొన్న షరతులకు లోబడి ఈ సడలింపు ఉంటుంది:

 గదులలో అయితే,  హాల్ సామర్థ్యంలో 50% మాత్రమే అనుమతించాలి. ఈ సంఖ్య గరిష్టంగా 200 ఉండాలి. ముఖానికి మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, థర్మ స్క్రీనిమ్గ్ ఏర్పాటు చేతులు శుభ్రపరచుకోవటం, శానిటైజర్ వాడకం తప్పనిసరి.

బహిరంగ ప్రదేశాలలో ఆ ప్రదేశం పరిమాణాన్ని బట్టి  భౌతికదూరం కచ్చితంగా పాటిస్తూ, మాస్కు ధరించటం కచ్చితం చేస్తూ,  థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తూ. చేతులు శుభ్రం చేసుకోవటానికి, శానితైజర్లు అందుబాటులో ఉంచటానికి ఏర్పాట్లు చేయాలి.

అలాంటి గుమికూడే సందర్భాలలో కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సవివరంగా ప్రామాణిక ఆచరణావిధానాలు జారీచేసి, గుమికూడటాన్ని కచ్చితంగా నియంత్రించాలి.

 దిగువ పేర్కొన్నవి తప్ప అన్ని కార్యకలాపాలూ కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల అనుమతించవచ్చు:

హోమ్ మంత్రిత్వశాఖ అనుమతించినప్పుడు తప్ప  ప్రయాణీకుల అంతర్జాతీయ విమాన ప్రయాణం

అక్టోబర్ 31 వరకూ కంటెయిన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కఠినంగా అమలు

కేంద్ర ఆరోగ్య, కుటృంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా జిల్లా అధికారులు కంయిన్మెంట్ జోన్ల పరిధులు నిర్ణయిస్తారు. వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవటమే పరనావధిగా ఈ నిర్ణయం జరుగుతుంది. ఈ జోన్లలో వ్యాధి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకుంటారు. కేవలం అత్యవసర కార్యకలాపాలు మాత్రమే అనుమతిస్తారు.

 కంటెయిన్మెంట్ జోన్ల లోపల కచ్చితంగా పరిసరాల పరిధిలో నియంత్రణ పాటించాలి.కేవలం అత్యవసర కార్యకలాపాలు మాత్రమే అనుమతిస్తారు..ఈ కంటెయిన్మెంట్ జోన్లను ఆయా జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వెబ్ సైట్లలో నోటిఫై చెయ్యాలి. అదే విషయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతో కూడా పంచుకోవాలి.

రాష్ట్రాలు కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల ఎలాంటి లాక్ డౌన్ విధించకూడదు   

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గ్రామాలు. నగరాలు/ సబ్ డివిజన్. జిల్లా/ రాష్ట్ర స్థాయిలో కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల ఎలాంటి లాక్ డౌన్ విధించకూడదు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మాత్రమే విధించాలి.

రాష్ట్రం లోపల, అంతర్రాష్ట్ర కదలికలమీద అంక్షలు లేవు

రాష్ట్రాల మధ్య , రాష్టం లోపల వ్యక్తుల రవాణా, సరకు రవాణా మీద ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అలాంటి కదలైకలకు ప్రత్యేకమైన అనుమతులు గాని, ఆమోదాలు గాని, ఈ-పర్మిట్ గాని అవసరముండదు.

కోవిడ్ -19 నిర్వహణ మీద జాతీయ ఆదేశాలు

కోవిడ్ -19 నిర్వహణకు సంబంధించి జాతీయ ఆదేశాలు  సామాజిక దూరం పాటించే విధంగా  దేశవ్యాప్తంగా అదే విధంగా కొనసాగుతాయి. దుకాణాలు తమ కస్టమర్ల మధ్య భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చూడాలి. జాతీయ అదేశాలు సమర్థంగా అమలు జరిగేలా హోం మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది.

సమస్య ప్రభావం పడే అవకాశమున్నవారి రక్షణ

 సమస్య ప్రభావం పడే అవకాశమున్న వారు, అంటే, 65 ఏళ్ళు పైబడినవారు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు,10 ఏళ్లలోపు పిల్లలు ఇళ్ళలోనే ఉండేవిధంగా సలహా ఇవ్వటమైనది. నిత్యావసరాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలకు మాత్రమే బైటికి వెళ్లవచ్చు.

ఆరోగ్య సేతు వాడకం

ఆరోగ్య సేతు మొబైల్ అప్లికషన్ వాడకాన్ని ప్రోత్సహించటం కొనసాగిస్తారు.

*****



(Release ID: 1660463) Visitor Counter : 321