గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
59వ పీఎస్‌ఎమ్‌జీ-ఐ సమావేశంలో రూ.389 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులు మంజూరు
- ఇప్పటి వరకు 360 మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు రూ.31,464 కోట్ల ఆర్థిక సహాయం
- 2020 సెప్టెంబర్ వరకు రూ.12,441 కోట్ల రుణ మొత్తం విడుదల
Posted On:
30 SEP 2020 3:07PM by PIB Hyderabad
ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం, రుణాల నిర్వహణలో తగిన పారదర్శకత మరియు జవాబుదారీతనం మెరుగుపరచడానికి డిజిటల్ / మొబైల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (పీ-ఎంఐఎస్) ప్రధాన దశ అని 'కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ' (ఎంఓహెచ్‌యుఏ) కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా అన్నారు. 'న్యూ క్యాపిటల్ రీజినల్ ప్లానింగ్ బోర్డ్' (ఎన్‌సీఆర్‌పీబీ) పీ-ఎంఐఎస్ వ్యవస్థను న్యూ ఢిల్లీలో ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్‌సీఆర్‌పీబీ తీసుకున్న చొరవను మిశ్రా అభినందించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం విపరీతంగా పెరిగిన వేళ ఎన్‌సీఆర్‌పీబీ ఈ పోర్టల్ తీసుకురావడం సమయోచిత చర్య అని అన్నారు. పీ-ఎంఐఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంఓహెచ్‌యుఏ అదనపు కార్యదర్శితో పాటు జేఎస్ అండ్ ఎఫ్ఏ, జీఎన్‌సీటీడీ అదనపు ప్రధాన కార్యదర్శి, ఎన్‌సీఆర్, ఎన్‌సీఆర్‌పీబీలలో పాలుపంచుకుంటున్న రాష్ట్రాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
రూ.12,441 కోట్ల రుణం విడుదల..
కేంద్ర హౌసింగ్ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా అధ్యక్షతన 28.9.2020న జరిగిన 59వ పీఎస్‌ఎమ్‌జీ- I సమావేశంలో మొత్తం రూ.389.22 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఆరు ప్రాజెక్టులకు మంజూరీ ఇవ్వడమైంది. వీటిలో దాదాపు
రూ.149.31 కోట్ల విలువైన హర్యాణా పీడబ్ల్యూడీకి (బీ & ఆర్) చెందిన 4-రవాణా రంగ ప్రాజెక్టులు ఉన్నాయి; రాజస్థాన్ ఆర్‌ఆర్‌వీపీఎన్‌కు చెందిన దాదాపు రూ. 31.58 కోట్ల విలువైన పవర్ ప్రాజెక్టుతో పాటుగా.. పటియాలా డెవలప్‌మెంట్ అథారిటీకి (పీడీఏ) చెందిన రూ.208.33 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఒక
నది పునరుజ్జీవన ప్రాజెక్టు కూడా ఇందులో ఉన్నాయి. దాదాపు రూ.31,464 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 360 మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు బోర్డు ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందించింది. ఇందులో ఇప్పటి వరకు దాదాపు రూ.15,105 కోట్ల మేర సొమ్మును రుణంగా మంజూరు చేశారు. ఈ నెల 27వ తేదీ నాటికి బోర్డు సుమారుగా రూ.12,441 కోట్ల సొమ్మును రుణం రూపంలో విడుదల చేసింది.
ఎన్‌సీఆర్ ప్లానింగ్ బోర్డు నిధులు సమకూర్చిన కొన్ని ప్రధాన ప్రాజెక్టులు:
(రూ. కోట్లలో)
క్రమ సంఖ్య
|
ప్రాజెక్టు పేరు
|
అంచనా వ్యయం
|
రుణ మంజూరీ/ సీసీ ప్రకారం తుది రుణం
|
వాస్తవ రుణ విడుదల
|
-
|
నోయిడా మరియు గ్రేటర్ నోయిడా మధ్య మెట్రో కనెక్షన్ ప్రాజెక్ట్ (29.707 కి.మీ.)
|
5503.00
|
1587.00
|
1430.00
|
-
|
అమనిషా నల్లా (ద్రవ్యవతి నది) యొక్క పునరుజ్జీవనంతో సహా జైపూర్ నగరపు ప్రాంత అభివృద్ధి
|
1582.06
|
1098.00
|
1059.00
|
-
|
జీడీఏ ద్వారా ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆరు వరుసల ఎలివేటెడ్ రోడ్ (హిండన్) అభివృద్ధి
|
1147.60
|
700.00
|
700.00
|
-
|
యాక్సెస్ నియంత్రిత కుండ్లి-మానేసర్-పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే విభాగం అభివృద్ధి
|
457.81
|
343.35
|
333.96
|
-
|
జైపూర్‌లోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో సోడాలా ట్రై-జంక్షన్ నుండి ఎల్‌ఐసీ కార్యాలయం వరకు ఎలివేటెడ్ రోడ్ నిర్మాణం
|
225.00
|
168.75
|
150.00
|
-
|
సోనిపట్ జిల్లాలో పారే పశ్చిమ యమునా కెనాల్ (డబ్ల్యువైసీ) ఒడ్డున హరేవెలి గ్రామానికి సమీపంలో ఘోగ్రిపూర్ నుండి హర్యాణా- ఢిల్లీ బోర్డర్ వరకు రెండు లేన్ల రిలీఫ్ రోడ్ నిర్మాణం
|
200.00
|
150.00
|
75.00
|
ఎన్‌సీఆర్‌పీబీ మార్కెట్ నుండి రుణాలు తీసుకుంటుంది మరియు బహుళ పక్ష, ద్వైపాక్షిక ఏజెన్సీలైన ఏడీబీ మరియు కేఎఫ్‌డబ్ల్యూ మొదలైన వాటి నుండి కూడా
రుణాలను పొందుతుంది. అనంతరం ఎన్‌సీఆర్‌లో పాల్గొనే రాష్ట్రాలకు మరియు వారి పారాస్టాటల్ ఏజెన్సీలకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను తక్కువ వడ్డీకి రుణ సహాయం అందిస్తుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్ (ఎన్ఆర్‌పీబీ) అనేది గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద పని చేసే ఒక చట్టబద్దమైన సంస్థ. ఇది 1985 లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది. జాతీయ రాజధాని ప్రాంతం అభివృద్ధికి ప్రాంతీయ ప్రణాళికను సిద్ధం చేయడానికి మరియు అటువంటి ప్రణాళిక అమలును సమన్వయం చేయడానికి మరియు పర్యవేక్షించే అధికారాన్ని ఇది కలిగి ఉంది; భూ వినియోగం నియంత్రణ మరియు ప్రాంతంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి మేటి విధానాలను రూపొందించడం ద్వారా ఈ ప్రాంతంలో చేపట్టే అపాయకరమైన అభివృద్ధి పనులను నివారించేలా విధాన రూపకల్పనకు ఇది పని చేస్తుంది.
***
(Release ID: 1660375)
Visitor Counter : 112