రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స్వదేశీ బూస్టర్‌తో కూడిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం

Posted On: 30 SEP 2020 2:28PM by PIB Hyderabad

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం మరోమారు విజయతమైంది. స్వదేశీ బూస్టర్‌, ఎయిర్‌ఫ్రేమ్‌ సెక్షన్‌, ఇంకా అనేక 'భారత్‌లో తయారీ' ఉప వ్యవస్థలను కలిగివుండడం ప్రస్తుత ప్రయోగంలోని విశేషాలు. ఒడిశాలోని బాలాసోర్‌ ఐటీఆర్‌ నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రయోగం నిర్వహించారు. దేశీయ సత్తా వృద్ధిల్లో ఈ విజయం మరో అడుగుగా మారింది. బ్రహ్మోస్‌ క్షిపణి గరిష్టంగా 2.8 మాక్‌ వేగంతో దూసుకెళ్లగలదు.

    అద్భుతమైన విజయం సాధించారంటూ; డీఆర్‌డీవో, బ్రహ్మోస్‌ బృందాన్ని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. డీఆర్‌డీవో ఛైర్మన్‌ డా.జి.సతీష్‌రెడ్డి కూడా శాస్త్రవేత్తల బృందాన్ని, పరిశ్రమను ప్రశంసించారు.

    ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రతిజ్ఞను నిజం చేస్తూ, శక్తిమంత బ్రహ్మోస్ వ్యవస్థ కోసం దేశీయ బూస్టర్‌, విడిభాగాలను తయారు చేయడానికి ఈ ప్రయోగ విజయం బాటలు పరిచింది.

***



(Release ID: 1660370) Visitor Counter : 298