విద్యుత్తు మంత్రిత్వ శాఖ

2020-21 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు సంబంధించి కేంద్ర విద్యుత్‌ శాఖతో ఎన్‌టీపీసీ ఎంవోయూ

'ఎక్స్‌లెంట్‌‌' రేటింగ్‌ కింద ఉత్పత్తి లక్ష్యం 340 బీయూ

ఎంవోయూలో భాగంగా, మూలధన వ్యయ లక్ష్యం రూ.21 వేల కోట్లు, ఆదాయం లక్ష్యం రూ.98 వేల కోట్లు

Posted On: 30 SEP 2020 12:08PM by PIB Hyderabad

2020-21 ఆర్థిక సంవత్సరానికి కీలక లక్ష్యాలతో, కేంద్ర విద్యుత్‌ శాఖతో, ఎన్‌టీపీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

'ఎక్స్‌లెంట్‌‌' రేటింగ్‌ కింద, 340 బీయూ విద్యుదుత్పత్తి, 15 ఎంఎంటీల బొగ్గు ఉత్పత్తి, మూలధన వ్యయం రూ.21 వేల కోట్లు, కార్యకలాపాల ఆదాయం రూ.98 వేల కోట్లను కీలక లక్ష్యాలుగా ఎంవోయూలో పేర్కొన్నారు. ఇతర ఆర్థిక ప్రమాణాలను కూడా ఎంవోయూలో చేర్చారు.



(Release ID: 1660301) Visitor Counter : 100