పర్యటక మంత్రిత్వ శాఖ

"గ్రామీణ పర్యాటక రంగం: మునుపటి నుండి రేపటికి ప్రస్థానం" పై దేఖో అప్నా దేశ్ వెబి‌నార్ సిరీస్‌ను నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 28 SEP 2020 3:41PM by PIB Hyderabad

"గ్రామీణ పర్యాటక రంగం: మునుపటి నుండి రేపటికి ప్రస్థానం" పేరుతో 2020 సెప్టెంబర్ 26న కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెబినార్ నిర్వహించింది. గ్రామాలు, ప్రజలు, వ్యవసాయం, సంస్కృతి, సుస్థిరత ఆలోచన, బాధ్యత, సామాజిక సహజీవనం వంటి అంశాలపై కేంద్రీకరిస్తూ ఈ వెబినార్ జరిగింది. పట్టణ పరిశ్రమల మొత్తం పతనం కారణంగా మిలియన్ల మంది 'వృత్తి ఉద్యోగాల' కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు లేదా జీతాలను బాగా తగ్గించుకున్నారు, మన నగరాలు మరియు పట్టణ పరిశ్రమలను నిర్మించిన మరికొన్ని మిలియన్ల శ్రామికులు తిరిగి వారి గ్రామాలకు చేరుకున్నారు గ్రామీణ భారతదేశంలో ప్రత్యామ్నాయ పర్యావరణ వ్యవస్థను సృష్టించే వాస్తవ అవకాశంతో వారి కష్టతరమైన ప్రయాణాలు సాగించారు. 

నగర జీవనంతో అలవాటుపడి  వినియోగతత్వం తో విసుగు చెందిన వారు ఇపుడు తిరిగి వారి గ్రామాలు, తాతముత్తాతలు ఆ వాతావరణం వైపు చూస్తున్నారు. తాను కోల్పోయిన సహజత్వాన్ని, భావోద్వేగాన్ని తిరిగి పొందాలని కొందరుమరికొందరు విలావంతమైన  గ్లోకెల్ గ్రామాలకు ఆకర్షితులవుతున్నారు. పర్యాటకం యొక్క ఈ కొత్త & రాబోయే శైలి ఇంటిపట్ల చింత ఉన్న కారణాల వల్ల వృద్ధుల విభాగంలోకి, అన్యదేశ కారణాల వల్ల మిలీనియల్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. 

 

సుదూర ప్రయాణం కొంతసేపు ఆగిపోతుందని మనమందరం అర్థం చేసుకున్నాము, కాబట్టి ఈ వెబి‌నార్ భారతదేశంలోని అందమైన గ్రామాల గుండా వర్చ్యువల్ గా మనల్ని తీసుకువెళ్ళింది, గ్రామీణ పర్యాటక రంగం ద్వారా పర్యాటక రంగంలో నమూనా మార్పుకు సాక్ష్యమిచ్చింది. గ్రీన్ పీపుల్, ది గోట్ విలేజ్ & బక్రీ చాప్ వ్యవస్థాపకుడు శ్రీ రూపేష్ రాయ్ సమర్పించారు. కేదార్‌నాథ్ విపత్తు తర్వాత మూడు నెలల తన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు - తన జీవితాన్ని శాశ్వతంగా మార్చుకున్నారు. రూపేష్ యొక్క కొన్ని కార్యక్రమాలలో ది గోట్ విలేజ్ (గ్రామీణ మరియు స్థిరమైన పర్యాటక రంగం), బక్రీ స్వయంవర్ (సోషల్ ఇంజనీరింగ్ ద్వారా పశువుల జీన్ పూల్ మెరుగుదల) మరియు బక్రీ చాప్ (అట్టడుగు హిమాలయ రైతులను సూచించే బ్రాండ్) ఉన్నాయి.

ఈ విపత్తు ఉత్తరాఖండ్ యొక్క మొత్తం రూపాన్ని మార్చివేసింది, ఎక్కువ భాగం నీటిలో మునిగిపోయింది. ప్రెజెంటర్ మొదటి ప్రాజెక్ట్ను హైలైట్ చేస్తున్నప్పుడు, 1800 గ్రామాలు ఖాళీగా ఉన్నాయి, వాటిలో కొన్ని మంచి అవకాశం కోసం ఖాళీ అయ్యాయి. గ్రామీణ పర్యాటకం వాస్తవానికి, ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది కమ్యూనిటీ టూరిజానికి అద్దం పడుతుంది. భారతదేశంలో సుమారు 6,47,000 గ్రామాలు ఉన్నాయి. సంస్కృతి, వ్యవసాయం, కళ, ప్రకృతి, ఆహారం మొదలైన వాటికి పర్యాటకం ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. 1990 ల వరకు పర్యాటకం రెండు రూపాలు మాత్రమే ఉన్నాయి- తీర్థయాత్ర మరియు గ్రామీణ పర్యాటక రంగం. సెలవుల్లో, పిల్లలు గ్రామంలోని తాతామామల ఇంటిని సర్వసాధారణంగా సందర్శిస్తారు. నెమ్మదిగా మనం వస్తుప్రపంచానికి దగ్గరై, బాధితులం అయ్యాము.

ఇలా అనేక పరిణామాలను స్పృశిస్తూ సాగింది వెబినార్. 

వెబి‌నార్ గురించి  అదనపు డైరెక్టర్ జనరల్ రుపేందర్ బ్రార్‌ మాట్లాడుతూ, పర్యావరణాన్ని గౌరవిస్తే మొత్తం మానవాళికి ప్రకృతితో వినయపూర్వకమైన అనుభవం ఉంటుందన్నారు. అదే సమయంలో, ప్రకృతిని గౌరవించాలని మరియు ప్రకృతితో సహజీవనం నేర్చుకోవాలని ఆమె స్పష్టం చేశారు. దేఖోఅప్నాదేశ్ వెబి‌నార్ సిరీస్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆధ్వర్యంలో భారతదేశం గొప్ప వైవిధ్యాన్ని వివరించే ప్రయత్నమని అన్నారు. 

డెఖో అప్నా దేశ్ వెబ్‌నార్ సిరీస్‌ను జాతీయ ఇ-గవర్నెన్స్ విభాగం, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సాంకేతిక భాగస్వామ్యంతో ప్రదర్శించారు. వెబి‌నార్ సెషన్‌లు ఇప్పుడు   https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured లో  అందుబాటులో ఉన్నాయి అలాగే, దేశంలోని పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క అన్ని సోషల్ మీడియాల్లోనూ కూడా అందుబాటులో ఉన్నాయి.

తదుపరి వెబి‌నార్ “గాంధీజీ: ది బాంబే ఇయర్స్” 2020 అక్టోబర్ 1 న ఉదయం 11.00 గంటలకు ఉంటుంది. 

*****


(रिलीज़ आईडी: 1659962) आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Tamil