రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
డీఏపీ, ఎన్‌పీకే ఎరువుల ధరలు పెంచే ఆలోచన లేదు: ఇఫ్కో
Posted On:
28 SEP 2020 4:07PM by PIB Hyderabad
డీఏపీ, ఎన్‌పీకే ఎరువుల గరిష్ట చిల్లర ధరలు పెంచే ఆలోచన లేదని 'ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోపరేటివ్ లిమిటెడ్' (ఇఫ్కో) స్పష్టం చేసింది.
పాస్ఫారిక్ ఆమ్లం వంటి ముడిపదార్థాల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగినా, రబీ సీజన్‌లో ఎరువుల ధరలు పెంచబోమని ఇఫ్కో ఎండీ యు.ఎస్.అవస్తి ట్వీట్ ద్వారా తెలిపారు.
"ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపు మేరకు, రైతులపై పెట్టుబడి భారం తగ్గించడం ద్వారా రైతులకు సేవ చేయడం మా లక్ష్యం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కూడా లక్ష్యం" అని పేర్కొన్నారు.
ఇఫ్కో.. ఎరువుల తయారీ, మార్కెటింగ్ వ్యాపారాల్లో ఉన్న ప్రముఖ సహకార సంఘం. దీనికి దేశవ్యాప్తంగా ఐదు తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
***
(Release ID: 1659872)