ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 తాజా సమాచారం
కొత్తగా నమోదవుతున్న 75% కేసులు 10 రాష్ట్రాలనుంచే
7 కోట్లు పైబడ్డ మొత్తం పరీక్షలు
Posted On:
26 SEP 2020 1:00PM by PIB Hyderabad
గడిచిన 24 గంటల్లో మొత్తం 85,362 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇలా కొత్తగా నిర్థారణ జరిగిన కేసుల్లో 75% పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉంది ఆ ఒక్క రాష్ట్రంలోనే 17 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఆ తరువాత స్థానాల్లో 8,000 తో ఆంధ్రప్రదేశ్, 7,000 తో కర్నాటక ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో 1089 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 83% 10 రాష్ట్రాలనుంచే రావటం కూడా గమనార్హం. మహారాష్ట్రమో అత్యధికంగా 416 మరణాలు నమోదు కాగా కర్నాటకలో 86, ఉత్త్రప్రదేశ్ లో 84 మరణాలు నమోదయ్యాయి.
ప్రతి పది లక్షలమందిలో పాజిటివ్ కేసులు లెక్కించినప్పుడు జాతీయ సగటు 4278 కాగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి.
ప్రతి పది లక్షలమందిలో మరణాలు జాతీయ స్థాయిలో సగటున 68 ఉందగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ జాతీయ సగటు కంటే తక్కువ నమోదు చేసుకున్నాయి.
భారతదేశంలో తగినంతగా పరీక్షల సామర్థ్యం పెరుగుతూ వచ్చింది. మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1823 లాబ్ లు ఉండగా వాటిలో 1085 ప్రభుత్వ రంగంలోను, 737 ప్రైవేటు రంగంలోను ఉన్నారు.
భారత పరీక్షల సామర్థ్యం రోజుకు 14 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 13,41,535 పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 7 కోట్లు దాటింది. ఈ రోజు వరకు 7,02,69,975 పరీక్షలు జరిగాయి. పెద్ద సంఖ్యలో పరీక్షలు జరపటం వలన తొలిదశలోనే పాజిటివ్ కేసులను గుర్తించి చికిత్స అందించే వెసులుబాటు కలుగుతోంది. దీనివలన పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టటంతోబాటు మరణాలు కూడా అదుపులో ఉంటున్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయి పాజిటివ్ శాతం 8.4% కాగా ప్రతి పది లక్షలమందిలో 50,920 పరీక్షలు చేశారు.
***
(Release ID: 1659423)
Visitor Counter : 184