ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
47.5 లక్షలు పైబడ్డ కోలుకున్నవారి సంఖ్య కోలుకున్నవారిలో 73% మంది 10 రాష్ట్రాలనుంచే
Posted On:
25 SEP 2020 4:16PM by PIB Hyderabad
ఒక్కరోజులో 15 లక్షలమందికి పరీక్షలు జరపటం ద్వారా అత్యధిక సంఖ్యలో పరీక్షలతో రికార్డులకెక్కిన రోజే భారత్ లో ఆ ధోరణి అదే పనిగా కొనసాగుతూ వస్తోంది. 47.5 లక్షలకు ( 47,56,164 మంది) పైగా బాధితులు కోవిడ్ నుంచి ఇప్పటివరకూ విముక్తులు కాగా గడిచిన 24 గంటల్లొనే 81,177 మంది కోలుకున్నారు.
చికిత్సలో ఉన్న 9,70,116 మందితో పోల్చుకున్నప్పుడు కోలుకున్నవారే నేటికి దాదాపు 38 లక్షలు (37,86,408 మంది) ఎక్కువగా నమోదయ్యారు. ఇంత భారీ సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో జాతీయ స్థాయిలో కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అది 81.74% అయింది.
కొత్తగా కోలుకున్నవారిలో 73% మంది కేవలం పది రాష్ట్రాలకు చెందినవారే ఉండటం కూడా గమనార్హం. అవు మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం. .
కొత్తగా కోలుకున్నవారి సంఖ్య రీత్యా మహారాష్ట్ర మొదటి స్థానంలోనే ఉంటూ వస్తోంది. ఆ రాష్ట్రంలో ఈరోజు 17,000 మంది కోలుకోగామ్ రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 8,000 మంది కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 86,052 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కొత్త కేసులలో 75% పది రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నట్టు కూడా స్పష్టమవుతోంది. వాటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 19,000 కొత్త కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రెండూ ఏడేసి వేలు మించి నమోదు చేశాయి.
గత 24 గంటల్లో 1,141 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 83% కూడా ఆ 10 రాష్ట్రాలనుంచే కావటం గమనార్హం.
నిన్న నమోదైన కొత్త మరణాలలో 40% మహారాష్ట్ర నుంచే కాగా అక్కడి మరణాల సంఖ్య 458. ఆ తరువాత స్థానంలో ఉన్న పంజాబ్ లో 76 మంది, ఉత్తరప్రదేశ్ లో 67 మంది చనిపోయారు.
***
(Release ID: 1659106)
Visitor Counter : 200