రక్షణ మంత్రిత్వ శాఖ
"డిఫెన్స్ ఇండస్ట్రీ గ్లోబల్ ఔట్‌రీచ్ ఫర్ కొలాబరేటివ్ పార్ట్‌నర్‌షిప్: వెబినార్ అండ్ ఎక్స్‌పో" అంశంపై ఇజ్రాయెల్‌తో వెబినార్
Posted On:
25 SEP 2020 9:33AM by PIB Hyderabad
భారత్-ఇజ్రాయెల్ మధ్య గురువారం ఓ వెబినార్ జరిగింది. "డిఫెన్స్ ఇండస్ట్రీ గ్లోబల్ ఔట్‌రీచ్ ఫర్ కొలాబరేటివ్ పార్ట్‌నర్‌షిప్: వెబినార్ అండ్ ఎక్స్‌పో" అంశంపై దీనిని నిర్వహించారు. ఎస్‌ఐడీఎం ద్వారా, భారత రక్షణ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం దీనిని నిర్వహించింది.
మిత్రదేశాలతో నిర్వహించతలపెట్టిన వెబినార్ల శ్రేణిలో ఇది మొదటిది. రక్షణ రంగ ఎగుమతులను పెంచి, వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల రక్షణ రంగ ఎగుమతుల విలువను సాధించాలన్నది వెబినార్ శ్రేణి లక్ష్యం.
రెండు దేశాల రక్షణ శాఖల కార్యదర్శులు, సీనియర్ అధికారులు వెబినార్‌లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు.
ఉభయ దేశాల మధ్య "రక్షణ పారిశ్రామిక సహకారం కోసం ఉప కార్యనిర్వహణ బృందం (ఎస్‌డబ్లూజీ)" ఏర్పాటు చేయాలని వెబినార్‌లో నిర్ణయించారు. సాంకేతికత, సహ అభివృద్ధి & సహ ఉత్పత్తి, కృత్రిమ మేధ, ఆవిష్కరణల బదిలీ, మిత్ర దేశాలకు ఉమ్మడి ఎగుమతులు ఎస్‌డబ్లూజీ లక్ష్యం.
కల్యాణి గ్రూప్, రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టం మధ్య ఈ వెబినార్‌లో ఒక ఎంవోయూ కుదిరింది. ఎస్‌ఐడీఎం-కేపీఎంజీ రూపొందించిన విజ్ఞానపత్రాన్ని రక్షణ శాఖ కార్యదర్శి డా.అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ వెబినార్‌లో 300 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎక్స్‌పో కోసం 90 వర్చువల్ ప్రదర్శన స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు.
***
(Release ID: 1659028)
Visitor Counter : 260