గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

'పీఎం స్వ‌నిధి పథకం' కింద రుణానికి 15 లక్షలకు పైగా దరఖాస్తులు

- దాదాపు ఐదున్న‌ర‌ లక్షలకు పైగా రుణాల‌ మంజూరు

- సుమారు రెండు లక్షల ల‌బ్ధిదారుల‌కు రుణాల‌ పంపిణీ

- రుణ మంజూరు ప్రక్రియ సులభత‌రానికి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి

- రుణ సంస్థల ద్వారా అమలు వేగవంతానికి త‌గిన చ‌ర్య‌లు

Posted On: 24 SEP 2020 1:22PM by PIB Hyderabad

'పీఎం వీధి వ్యాపారుల‌ ఆత్మ నిర్భర్ నిధి' (పీఎం స్వ‌నిధి) పథకం కింద రుణ సౌక‌ర్యం కోరుతూ ఇప్పటి వరకు దాదాపు 15 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి.
వీటిలో 5.5 లక్షలకు పైగా రుణాలు మంజూరు చేయబడ్డాయి మ‌రియు సుమారు 2 లక్షల మందికి రుణాలు పంపిణీ చేయబడ్డాయి. కోవిడ్-19 లాక్‌డౌన్ త‌రువాత‌
వీధుల్లో వ్యాపారాలు చేసే చిన్న వ్యాపారులు వారి వ్యాపారాలను తిర‌గి మొద‌లు
పెట్టేందుకు వీలుగా 50 లక్షల మంది వీధి విక్రేతలకు అనుషంగికమైన‌ ఉచిత నిర్వ‌హణ‌ మూలధన రుణాన్ని అందించ‌డానికి గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'పీఎం వీధి వ్యాపారుల‌ ఆత్మ నిర్భర్ నిధి' (పీఎం స్వ‌నిధి) పథకాన్ని అమలు చేస్తోంది. రుణ మంజూరీ ప్రక్రియను మ‌రింత‌గా
వేగవంతం చేయడానికి, రుణదాతలకు నిర్వ‌హ‌ణ సౌలభ్యాన్ని అందించడానికి  గాను దరఖాస్తులను నేరుగా బ్యాంకు శాఖలకు పంపాల‌ని నిర్ణయించారు. వీటిని విక్రేత 'ఇష్టపడే రుణదాత' లేదా 'ఇష్టపడే రుణదాత'ను సూచించబడకపోతే విక్రేత పొదుపు ఖాతా కలిగి ఉన్న చోటకు పంపించి.. అక్క‌డ రుణ సౌల‌భ్యం అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ చ‌ర్య రుణ‌ మంజూరీకి త‌గు విధంగా
ప్రోత్సాహాన్ని ఇస్తుందని, రుణాల పంపిణీ సమయాన్ని తీవ్రంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. పైన పేర్కొన్న ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయబడింది. ఇది సెప్టెంబర్ 11, 2020న అమలులోకి వచ్చింది.
ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి సుమారు 3 లక్షల దరఖాస్తుల్ని ఆయా బ్యాంకులకు పంపించ‌బ‌డ్డాయి. ఇక మీదట, ప్రతిరోజూ ల‌బ్ధ‌దారు‌లు ఇష్టపడే రుణదాతలకు ద‌ర‌ఖాస్తులు పంపించ‌బ‌డతాయి. ఇష్టపడే రుణదాతల‌ను సూచించబడని వారి  ద‌ర‌ఖాస్తు‌లు వారానికొకసారి రుణ‌దాత‌ల‌కు పంపుతారు. ఈ త‌ర‌హా చర్యలు రుణ సంస్థలచే పీఎం స్వ‌నిధి పథకం అమలును వేగవంతం చేస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడం ద్వారా వీధి వ‌ర్త‌కుల్లో '‌ఆత్మ‌ నిర్భర్‌స పెంపొంద‌నుంది.

                             

***



(Release ID: 1658751) Visitor Counter : 280