సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫ్పి 51వ ఎడిషన్‌పై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి పత్రిక ప్రకటన
Posted On:
24 SEP 2020 2:03PM by PIB Hyderabad
ఈ ఏడాది నవంబర్ 20-28 తేదీల్లో గోవాలో జరగాల్సిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 51వ ఎడిషన్, వచ్చే ఏడాది జనవరి 16-24 తేదీలకు వాయిదా పడింది. గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్‌తో.. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మార్గదర్శకాలు, ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించాలని సంయుక్తంగా నిర్ణయించారు. ఈ వేడుక మిశ్రమ పద్ధతిలో అంటే వర్చువల్, భౌతిక విధానాల్లో జరగనుంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాటించిన తరహాలోనే ఇక్కడ కూడా కొవిడ్ సంబంధిత ప్రొటోకాల్స్ అన్నీ అమలు చేస్తారు.
***
(Release ID: 1658690)
Visitor Counter : 227
Read this release in:
Marathi
,
Urdu
,
Tamil
,
Kannada
,
Bengali
,
Gujarati
,
English
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Malayalam