ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొత్త కేసులను మించి పెరుగుతున్న రికవరీలు వరుసగా ఆరో రోజూ కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువ

13 రాష్ట్రాల్లో కొత్త కేసులను మించిన రికవరీ కేసులు

10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 74శాతం కొత్త రికవరీలు

Posted On: 24 SEP 2020 11:12AM by PIB Hyderabad

  దేశంలో కోవిడ్ వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య విశేషంగా పెరుగుతూ వస్తోంది. కోవిడ్ నియంత్రణకు పటిష్టమైన వ్యూహాలు, ప్రజా ప్రయోజనాలే  లక్ష్యంగా చేపడుతున్న చర్యలతో ఇది సాధ్యమైంది.

  గత ఆరు రోజులుగా కోవిడ్ నుంచి తాజాగా కోలుకుంటున్న వారి సంఖ్య ,కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. పరీక్ష నిర్వహణ, కేసుల లింకులను కనిపెట్టడం, చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తిపై నిఘాతో వ్యవహరించడం తదితర కారణాలవల్ల ఫలితాలు కూడా బాగున్నాయి. ప్రధానమంత్రి నిన్నటి సమీక్షా సమావేశంలో పేర్కొన్నట్టు కేసులు ఎక్కువగా ఉన్న 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై దృష్టిని కేంద్రీకరించినందునే కోవిడ్ వియంత్రణలో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి.

  గత 24 గంటల్లో దేశంలో 87,374 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 86,508. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 46.7లక్షలు (46,74,987). రికవరీ రేటు 81.55 శాతాన్ని దాటింది.

WhatsApp Image 2020-09-24 at 10.12.44 AM.jpeg

  దేశంలో కొత్త కేసులకంటే ఎక్కువగా రికవరీ కేసులు నమోదవుతూ ఉండగా, రికవరీకేసులకు, క్రియాశీలక (యాక్టివ్) కేసులకు మధ్య అంతరం నిరంతరంగా పెరుగుతూ పోతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 9,66,382కాగా,  రికవరీ కేసుల సంఖ్య 46,74,987.  యాక్టివ్ కేసులకంటే రికవరీ కేసులు 37లక్షలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 16.86శాతం మాత్రమే. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా  క్రమంగా తగ్గుతూ వస్తోంది.

 

WhatsApp Image 2020-09-24 at 10.12.45 AM.jpeg

 జాతీయ స్థాయిలో కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.  13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా కొత్త కరోనా కేసులకంటే కొత్త రికవరీ కేసులో ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి.

 

WhatsApp Image 2020-09-24 at 10.12.42 AM.jpeg

 కొత్త రికవరీ కేసుల్లో దాదాపు 74శాతం,.. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి. విషయంలో  మహారాష్ట్ర 19,476 కేసుల (22.3శాతం)తో వరుసగా 6 రోజు ఆధిక్యం కొనసాగిస్తూ వస్తోంది.

 

   కోవిడ్ నియంత్రణలో టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే విధానంతో కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో క్రియాశీలక వ్యూహాన్ని అనుసరించడం, ‘వైరస్ ను వెన్నాడటంపై దృష్టిని కేంద్రీకరించడం వల్లనే  ప్రోత్సాహకరమైన ఫలితాలు వస్తున్నాయిపెద్ద సంఖ్యలో, భారీ స్థాయిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మందస్తుగానే కేసులను గుర్తించడం, వైరస్ వ్యాప్తిపై గట్టి నిఘా పెట్టి, పాజిటివ్ కేసుల లింకులను పట్టుకోవడం, రోగులకు కేంద్రం జారీ చేసిన అత్యున్నత నాణ్యాతా ప్రమాణాలతో చికిత్స అందించడం.. తదితర చర్యలన్నీ రికవరీ కేసుల వృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి.

   ఆసుపత్రుల్లో కేసులకు మెరుగైన, పటిష్టమైన చికిత్స అందించడం, హోమ్ ఐసొలేషన్ కేసులపై నిరంతర పర్యేవేక్షణ చూపడం, అవసరమైన కేసుల్లో ఆక్సిజన్, స్టెరాయిడ్ల సదుపాయం కల్పించడం, రక్త గడ్డకట్టకుండా నివారించే మందులు వాడటం, సకాలంలో చికిత్స అందించేందుకు మెరుగైన అంబులెన్స్ సేవలను వినియోగించడం వంటి  అంశాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిరంతరం దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చాయి. ఇంటివద్ద ఐసొలేషన్ లో ఉంటున్న రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిఘాతో ఉంటూ, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంలో ఆశా కార్యకర్తలు నిర్విరామంగా పనిచేశారు.

  కోవిడ్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో- సంజీవనిడిజిటల్ వేదిక కూడా ఎంతగానో ఉపయోగపడిందిరోగులకు సకాలంలో టెలీ మెడిసిన్ వైద్య సేవలు అందించడానికి- సంజీవనిఎంతో దోహదపడింది. కోవిడ్ కేసులకు కాకుండా ఇతర రకాల రుగ్మతల్లో ఆరోగ్య రక్షణ విధులకు కూడా ఇది సహాయకారిగా పనిచేసింది. అంతేకాక, .సి.యు. సదుపాయాలున్న డాక్టర్ల క్లినికల్ నిర్వహణా వ్యవస్థను ఏర్పాటు చేయడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. 'కోవిడ్-19 నిర్వహణపై నేషనల్ -.సి.యు' పేరిట ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (...ఎం.ఎస్.) డొమైన్ నిపుణులు నిర్వహించిన సదస్సు ఇందుకు ఎంతో ఉపకరించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇలాంటి 20 సదస్సులు నిర్వహించారు. 278 సంస్థలు, ప్రతిభా కేంద్రాలు పాలు పంచుకున్నాయి.

****

                                                                                                                                                                              

 


(Release ID: 1658685) Visitor Counter : 186