హోం మంత్రిత్వ శాఖ
రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ అంగడి మృతికి సంతాప సూచకంగా దిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాలు సగం వరకు అవనతం
प्रविष्टि तिथि:
24 SEP 2020 10:56AM by PIB Hyderabad
రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ అంగడి మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.
శ్రీ అంగడి మృతికి సంతాప సూచకంగా దిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న జాతీయ పతాకాలను సగం వరకు కిందకు దించారు. సంతాప దినాల్లో జాతీయ పతాకాలను ఈ విధంగా అవనతం చేస్తారు.
అంతిమ సంస్కారాలను నిర్వహించే స్థలం, తేదీ, సమయాన్ని త్వరలో తెలియజేస్తారు.
***
(रिलीज़ आईडी: 1658642)
आगंतुक पटल : 132