ప్రధాన మంత్రి కార్యాలయం
కార్మిక సంస్కరణల బిల్లులను ఆమోదించడాన్నిప్రధానమంత్రి ప్రశంసించారు; కార్మిక సంస్కరణలు కార్మికుల శ్రేయస్సును నిర్ధారిస్తాయనీ, ఆర్థిక వ్యవస్థను పెంచుతాయనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు.
प्रविष्टि तिथि:
23 SEP 2020 8:57PM by PIB Hyderabad
కార్మిక సంస్కరణల బిల్లులను ఈ రోజు పార్లమెంటు ఆమోదించడాన్ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ విషయమై, ప్రధానమంత్రి వరుస ట్వీట్లు చేస్తూ, "దీర్ఘకాలంగా మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్మిక సంస్కరణలను పార్లమెంటు ఆమోదించింది. ఈ సంస్కరణలు కష్టపడి పనిచేసే మన కార్మికుల శ్రేయస్సును నిర్ధారిస్తాయి, వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. అవి, ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ కు ప్రకాశవంతమైన ఉదాహరణలు.
కొత్త కార్మిక నియమాలు, కనీస వేతనాలు మరియు వేతనాలను సకాలంలో చెల్లించడాన్ని విశ్వవ్యాప్తం చస్తాయి. కార్మికుల వృత్తి భద్రతకు ప్రాధాన్యత ఇస్తాయి. మెరుగైన పని వాతావరణానికి ఈ సంస్కరణలు దోహదం చేస్తాయి, ఇవి ఆర్థిక వృద్ధి వేగాన్ని పెంచుతాయి.
కార్మిక సంస్కరణలు ‘సులభతర వ్యాపారాన్ని’ నిర్ధారిస్తాయి. సమ్మతిని, రెడ్-టాపిజం మరియు ‘ఇన్స్పెక్టర్ రాజ్’ లను తగ్గించడం ద్వారా సంస్థలను శక్తివంతం చేయడానికి ఇవి భవిష్యత్ చట్టాలు. కార్మికుల మరియు పరిశ్రమల యొక్క మంచి కోసం సాంకేతిక శక్తిని ఉపయోగించుకోవటానికి, ఈ సంస్కరణలు ప్రయత్నిస్తాయి." అని పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1658420)
आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam