వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఆహారధాన్యాల పంపిణీ

Posted On: 23 SEP 2020 1:31PM by PIB Hyderabad

కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 (ఎన్ఎఫ్ఎస్ఎ) పరిధిలో ఉన్న లబ్ధిదారులకు మూడు నెలల పాటు, అంటే ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో, అదనంగా ఉచిత పంపిణీ చేయడానికిగాను అన్ని రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం సుమారు 121 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎమ్ టి) ఆహారధాన్యాలను ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ (పిఎంజికెఎవై-1) ఒకటో దశలో భాగం గా కేటాయించడం జరిగిందని కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ దాన్వే రావు సాహెబ్ దాదారావు బుధవారం రాజ్య సభ లో ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానం లో తెలిపారు.

 

 

పిఎంజికెఎవై రెండో దశ లో భాగం గా ఐదు నెలల పాటు, అంటే ఈ ఏడాది జులై నుంచి నవంబర్ వరకు ఈ పథకాన్ని పొడిగించి, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 201 ఎల్ఎమ్ టి ఆహారధాన్యాలను ఉచితంగా కేటాయించడమైందని కూడా మంత్రి వివరించారు. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు జులై లో మొత్తం ఆహార ధాన్యాల్లో 90 శాతం, ఆగస్టులో 85 శాతం పంపిణీ చేయగా, ఈ సెప్టెంబర్ నెలలో దాదాపు 20 శాతం ఆహార ధాన్యాలను పంపిణీ చేశాయి.

 

లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టిపిడిఎస్) సంస్కరణల్లో భాగంగా ‘ఒక దేశం, ఒక రేషన్ కార్డు’ (ఒఎన్ఒఆర్ సి) ప్రణాళిక ను అమలు చేయడం జరుగుతోందని, ఎన్ఎఫ్ఎస్ఎ పరిధిలో ఉన్న వలస రేషన్ కార్డుదారులు ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా వారికి దక్కే ఆహారధాన్యాలను దేశం లో ఎక్కడైనా సరే తాము కోరుకున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePoS) ఆధారిత చౌక ధర దుకాణం (ఎఫ్.పి.ఎస్) నుంచి తీసుకొనేందుకు వీలు కల్పించడమే టిపిడిఎస్ సంస్కరణల ధ్యేయం. వలస రేషన్ కార్డుదారులు వారి వద్ద ఇప్పుడు ఉన్న అదే రేషన్ కార్డు ను ఇపిఒఎస్ పరికరం లో బయోమెట్రిక్/ఆధార్ ప్రమాణీకరణ పూర్తి చేసిన అనంతరం ఆహారధాన్యాలను అందుకోవచ్చని మంత్రి వివరించారు. ఇంతవరకు ఈ సదుపాయం 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపుగా 65 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చిందని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.

***



(Release ID: 1658358) Visitor Counter : 228