మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ట్రిపుల్ ఐ.టి.ల చట్టాల సవరణలకు రాజ్యసభ ఆమోదం

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఐదు ట్రిపుల్ ఐ.టి.లు

సూరత్, భోపాల్, భాగల్పూర్, అగర్తలా, రాయిచూర్ లలో

జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా ఏర్పాటు

Posted On: 22 SEP 2020 3:21PM by PIB Hyderabad

 

   భారతీయ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల (ట్రిపుల్ .టి.) చట్టాల సవరణ బిల్లుకు రాజ్యసభ రోజు ఆమోదముద్ర వేసింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలో బోధనకు సంబంధించి, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ రూపంలో పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం వినూత్నమైన చర్యలు తీసుకుంది. ఇందుకోసం 2014 సంవత్సరపు భారతీయ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల చట్టాన్ని, 2017 సంవత్సరపు భారతీయ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య) చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. తాజాగా చట్టాల సవరణకు కొత్తగా బిల్లును తీసుకువచ్చింది. 2020 సంవత్సరపు భారతీయ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల చట్టాల (సవరణ) బిల్లు పేరిట తీసుకువచ్చిన బిల్లుకు లోక్ సభ 2020, మార్చి 20 ఆమోదం తెలిపింది.

  సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్నిశాంక్మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సవరణ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయని, అందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. బిల్లును ఆమోదం పొందడానికి మద్దతు ఇచ్చిన సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. సృజనాత్మకత, నైపుణ్య పద్ధతుల ద్వారా దేశంలో ట్రిపుల్ .టి.లు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ విద్య అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి బిల్లు దోహదపడుతుందన్నారు

   గతంలో 2014, 2017లో తీసుకువచ్చిన ప్రధాన బిల్లుల సవరణకు,.. భారతీయ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల చట్టాల (సవరణ ) బిల్లు వీలు కల్పిస్తుంది. ఐదు ట్రిపుల్ .టి.లను ప్రభుత్వ, ప్రైవేటు పద్ధతిలో నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. సూరత్, భోపాల్, భాగల్పూర్, అగర్తలా, రాయిచూర్ ట్రిపుల్ .టి.లను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా నడపడానికి బిల్లు ద్వారా అవకాశం ఏర్పడుతుంది.. దేశంలో ఇప్పటికే నడుస్తున్న 15 ట్రిపుల్ .టి.లకు సమానంగా చట్టబద్ధమైన ప్రతిపత్తిని వీటికీ కల్పించనున్నారని, 2017 సంవత్సరపు ట్రిపుల్ .టి. (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) బిల్లు ప్రకారం ప్రతిపత్తి కల్పిస్తారని కేంద్ర మంత్రి చెప్పారు.

     అంతేకాక, ఏదైనా విశ్వవిద్యాలయం, లేదా జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థ జారీ చేసే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (http://B.Tech), లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (http://M.Tech) లేదా పి.హెచ్.డి. డిగ్రీల పేర్లను సంస్థలు కూడా వినియోగించుకోవడానికి తగిన అధికారాన్ని సవరణ బిల్లు ధఖలు పరిచిందని మంత్రి చెప్పారు. దేశంలో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీకి బలమైన పరిశోధనా పునాదిని ఏర్పరుచుకునేందుకు తగిన సంఖ్యలో విద్యార్థులను సంస్థలు చేర్చుకోవడానికి  కూడా బిల్లు వీలుకలిగిస్తుందన్నారు.

 

నేపథ్యం

 (i) ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నత విద్యను, పరిశోధనను ప్రోత్సహించే లక్ష్యంతో ట్రిపుల్ .టి.లకు రూపకల్పన చేశారు.

(ii) పథకం కింద కింద, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో 20 కొత్త ట్రిపుల్ .టి. సంస్థలను ఏర్పాటుకు 2010 నవంబరు 26 కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో 15 ట్రిపుల్ .టి.లకు ఇప్పటికే 2017 సంవత్సరపు ట్రిపుల్ .టి. (పి.పి.పి.) చట్టాన్ని వర్తింపజేశారు. మిగిలిన ఐదు ట్రిపుల్ .టి. సంస్థలను కూడా చట్టంలోని షెడ్యూల్ కిందకు తీసుకురావలసి ఉంది.   

  అమలు వ్యూహం,..లక్ష్యాలు

 సూరత్, భోపాల్, భాగల్పూర్, అగర్తలా, రాయిచూర్ లలో ట్రిపుల్ .టి.లను చట్టబద్ధమైన ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా తీర్చిదిద్దడం ప్రస్తుత ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ట్రిపుల్ .టి.లన్నీ, రిజిస్టరైన సొసైటీల రూపంలో పనిచేస్తున్నాయి. 1860 సంవత్సరపు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద ఇవి నమోదై ఉన్నాయి. అవన్నీ ఇపుడు 2017 సంవత్సరపు ట్రిపుల్ .టి. (పి.పి.పి.) చట్టం పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే స్థిరపడిన మిగిలిన 15 ట్రిపుల్ .టి. లాగానే, ప్రభుత్వ, ప్రైవేటు పద్ధతిలో వీటికీ చట్టాన్ని వర్తింపజేస్తారు.

ప్రధాన ప్రభావం

ప్రస్తుతం ఉన్న 15 ట్రిపుల్ .టి. వలెనే, మిగిలిన 5 ట్రిపుల్ .టి. సంస్థలను కూడా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలోకి తీసుకువస్తారు. ‘జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా వాటికి డిగ్రీలు మంజూరు చేసే అధికారం దఖలు పరుస్తారుదీనితో ఏదైనా విశ్వవిద్యాలయం, లేదా జాతీయ ప్రాముఖ్యంకలిగిన సంస్థ జారీ చేసినట్టుగా  బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బి.టెక్.), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎం.టెక్.) లేదా పి.హెచ్.డి..తదితర డిగ్రీల పేర్లను వాడుకోవడానికి సంస్థలకూ వీలుంటుందిదేశంలో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో బలమైన పరిశోధనాపరమైన పునాదిని ఏర్పరుచుకునేందుకు సంస్థలకూ అవకాశం ఏర్పడుతుంది.

లాభం పొందే సంస్థలు, పరిశ్రమలు

సంస్థలనుంచి శిక్షణ పొందిన ప్రతిభ, నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు దొరుకుతారు. దీనితో సాంకేతిక నైపుణ్యంతో మానవ వనరులు అందుబాటులోకి వచ్చి, పారిశ్రామిక, ఆర్థిక రంగం అవసరాలు తీరుతాయి.

సంస్థలు ఉండే రాష్ట్రాలు/జిల్లాలు

రాష్ట్రాలు: గుజరాత్ (సూరత్), మధ్యప్రదేశ్ (భోపాల్), బీహార్ (భాగల్పూర్), త్రిపుర (అగర్తలా), కర్ణాటక (రాయిచూర్).

 ప్రతి ట్రిపుల్ .టి. సంస్థల్లో అర్హులందరిరీ అవకాశం ఉంటుంది. లైంగిక, కుల, వర్ణ, వైకల్య, నివాస, జాతి, సామాజక, ఆర్థికపరమైన ఎలాంటి వివక్షకూ సంస్థల్లో అవకాశం లేదు.

 

******



(Release ID: 1657916) Visitor Counter : 228