భారత ఎన్నికల సంఘం

మీడియాలోని ఒక విభాగంలో అవాస్తవ ప్రచారం

Posted On: 22 SEP 2020 10:22AM by PIB Hyderabad

బిహార్‌ రాష్ట్ర ఎన్నికల తేదీల ప్రకటనకు సంబంధించి మీడియాలోని ఒక విభాగం అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. సోమవారం దిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో సీఈసీ శ్రీ సునీల్‌ అరోరా చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుంది.

    సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పత్రిక ప్రకటనలో, "బిహార్‌లో పర్యటించినపుడు; రెండు, మూడు రోజుల్లో కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని సీఈసీ పేర్కొంది" అన్న వాఖ్యాన్ని ప్రత్యేకంగా గమనించాలి.

    ఏఎన్‌ఐ కథనాన్ని ఆధారంగా చేసుకుని వార్తను ప్రసారం చేసిన అన్ని మీడియా సంస్థలు, ఈసీఐ జారీ చేసిన పత్రిక ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో బిహార్‌లో ఈసీఐ పర్యటన ఖరారు కానుంది అన్న వాఖ్యాన్ని గమనించి, వార్తను సరిచేసుకోవాలని విజ్ఞప్తి.

    ఏఎన్‌ఐ కథనంలో పేర్కొన్నట్లు; ఈసీఐ బిహార్ పర్యటనకు, ఆ రాష్ట్ర ఎన్నికల తేదీల ప్రకటనకు ఎలాంటి సంబంధం లేదని గుర్తించాలని విజ్ఞప్తి.

***



(Release ID: 1657617) Visitor Counter : 130