ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి కి, భూటాన్ రాజు కి మధ్య టెలిఫోన్ ద్వారా జ‌రిగిన సంభాష‌ణ

Posted On: 17 SEP 2020 11:20PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యెల్ వాంగ్‌ చుక్ తో ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.    

ప్ర‌ధాన మంత్రి 70వ పుట్టిన‌ రోజు ను పురస్కరించుకొని ఆయనకు భూటాన్ రాజు శుభాకాంక్ష‌లు తెలిపారు.  ప్ర‌ధాన మంత్రి ఈ శుభాకాంక్షలను కృత‌జ్ఞ‌త‌పూర్వకంగా స్వీకరిస్తూ,  భూటాన్ రాజు తో పాటు భూటాన్ మాజీ రాజు కు, అలాగే భూటాన్ రాజ‌కుటుంబ స‌భ్యులంద‌రికీ కూడా త‌న నమస్కారాలందజేశారు.  

భార‌త‌దేశాన్ని, భూటాన్ ను ఇరుగు పొరుగు దేశాలు గానే గాక‌, మిత్ర దేశాలుగా కూడా క‌లిపి ఉంచుతున్న న‌మ్మ‌కం, ప్రేమ‌ అనే అద్వితీయ బంధాలను గురించి నేత‌లు మాట్లాడుకొన్నారు.  ఈ ప్ర‌త్యేక మైత్రిని పెంచి పోషించ‌డం లో భూటాన్ కు చెందిన రాజు లు మార్గ‌ద‌ర్శ‌క‌ప్రాయ‌ పాత్ర ను పోషిస్తున్నందుకు ప్ర‌ధాన మంత్రి త‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

భూటాన్ రాజ్యం లో కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి ని ప్ర‌భావ‌వంత‌ంగా అడ్డుకొంటున్నందుకు ప్ర‌ధాన మంత్రి హ‌ర్షాన్ని ప్రకటించారు.  ఈ విష‌యం లో భూటాన్ కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాలుగా సాయపడటానికి భార‌త‌దేశం సిద్ధంగా ఉంద‌ంటూ రాజు కు ఆయ‌న హామీని ఇచ్చారు. 

ఇరు ప‌క్షాల కు వీలైన స‌మ‌యం లో రాజు ను, రాజుగారి కుటుంబాన్ని భార‌త‌దేశ సంద‌ర్శ‌న కు ఆహ్వానించాల‌ని ఉంద‌ంటూ ప్ర‌ధాన మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

***



(Release ID: 1656086) Visitor Counter : 190