రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

అవసరమైన వైద్య పరికరాలు సరైన ధరల్లో అందుబాటులో ఉంచే హామీ మేరకు మోకాలి కృత్రిమ అవయవ పరికరాల ధరల గరిష్ఠ పరిమితిని 2021 సెప్టెంబర్ 14 వరకు పొడిగించిన ఎన్‌పిపిఎ

దీనివల్ల సామాన్యులకు 1500 కోట్ల రూపాయల ఆదా

Posted On: 17 SEP 2020 11:15AM by PIB Hyderabad

అందుబాటు ధరల్లో సామాన్య ప్రజలకు అవసరమైన వైద్య పరికరాలు సౌలభ్యంగా ఉండడానికి, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ  ఫార్మాస్యూటికల్స్ విభాగం కింద ఉన్న  ఔషధ ధరలను నియంత్రించే, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ), మోకాలి కృత్రిమ అవయవ పరికరాల ధరల గరిష్ఠ పరిమితి నియంత్రణను మరో సంవత్సరానికి అంటే 14 సెప్టెంబర్ 2021 వరకు పొడిగించింది. ఈ విషయంలో 2020 ఔషధ ధరల నియంత్రణ ఆర్డర్ (డిపిసిఓ), 2013 (అనెక్స్ -2) కింద ఎన్‌పిపిఎ 2020 సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేసింది.

ఎన్‌పిపిఎ మొదటిసారి ఆగస్టు 16, 2017 నాటి ఆర్థోపెడిక్ మోకాలి ఇంప్లాంట్ల గరిష్ఠ పరిమితి ధరను ఒక సంవత్సరం కాలానికి నిర్ణయించింది. ఇది 2018 ఆగస్టు 13 న, తరువాత 15 ఆగస్టు 2019 న పొడిగించారు. ఈ గడువు కూడా 15 ఆగస్టు 2020 తో ముగిసింది, మోకాలి మార్పిడి వ్యవస్థ కోసం మోకాలి ఇంప్లాంట్ల గరిష్ఠ పరిమితి ధరలు 15-ఆగస్టు -2020 నాటికి సమీక్షించాల్సి ఉంది.

జూలై 2018న ఎన్‌పిపిఎ మోకాలి కృత్రిమ పరికరాలు తయారుచేసే, దిగుమతి చేసుకునే అన్ని సంస్థలను జూలై 2018 నుండి జూన్ 2020 వరకు అమ్మకాల డేటాను సమర్పించాలని ఆదేశించింది. 2020 ఆగస్టు 6 న జరిగిన సమావేశాలలో, 14 ప్రధాన కంపెనీల (10 దిగుమతిదారులు) నుండి సేకరించిన డేటాను పరిశీలించిన తరువాత ఎన్‌పిపిఎ, 4 దేశీయ తయారీదారులు) 2020 ఆగస్టు 15 న వర్తించే మోకాలి ఇంప్లాంట్ల ధరలను 2020 సెప్టెంబర్ 15 వరకు అంటే ఒక నెల వరకు పొడిగించాలని నిర్ణయించారు.

2020 సెప్టెంబర్ 14 న జరిగిన అథారిటీ సమావేశంలో ఈ విషయం మళ్లీ చర్చించారు. 2017 లో ఆర్థోపెడిక్ మోకాలి ఇంప్లాంట్ల కోసం సీలింగ్ ధరలను నిర్ణయించడం వల్ల ధర 69% వరకు తగ్గిందని, దేశీయ తయారీదారుల మార్కెట్ వాటా  రెండేళ్ల కాలంలో 11% పెరిగిందని సమావేశంలో గుర్తించారు. ఇది 'ఆత్మనిర్భర భారత్' నినాదానికి అనుగుణంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, విస్తృత ప్రజా ప్రయోజనంతో సీలింగ్ ధరల వ్యవస్థను నియంత్రించడం అవసరం అని భావించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న సీలింగ్ ధరలను మరో ఏడాదికి (2021 సెప్టెంబర్ 14 వరకు) పొడిగించాలని అథారిటీ నిర్ణయించింది, ఈ విషయంలో 2020 సెప్టెంబర్ 15 న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ చర్య వల్ల సామాన్యులకు 1500 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది.

 

****



(Release ID: 1655518) Visitor Counter : 179