పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పరిధిలో రీఫిళ్ల డిమాండ్

Posted On: 14 SEP 2020 2:18PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై)  పథకం కింద 8 కోట్ల కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 2019 సెప్టెంబరులో ఆ లక్ష్యాన్ని సాధించడం జరిగింది.  ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పిఎంజికెపి)  కింద చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓ ఎం సి) 2020 ఆగస్టు వరకు  1306.87 లక్షల వంటగ్యాస్ సిలిండర్ రీఫిళ్లను  పిఎంయువై  లబ్ధిదారులకు ఇచ్చాయి.   రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పిఎంజికెపి కింద బట్వాడా చేసిన సిలిండర్ల వివరాలు అనుబంధంలో ఇవ్వడం జరిగింది.  

       ఉజ్వల లబ్ధిదారులు వంటగ్యాస్ సిలిండర్ రీఫిళ్లు కొనేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు పిఎంజికెపి కింద రూ. 9670.41 కోట్లు బదిలీ చేశాయి.  

        2019-20 సంవత్సరంలో ఉజ్వల లబ్ధిదారుల  వంటగ్యాసు రీఫిళ్ల  సగటు వినియోగం 3.01 సిలిండర్లు (14.2 కిలోల బరువున్న).  ఉజ్వల లబ్ధిదారులు వంటగ్యాసును అనుసరించి  వినియోగించడమే  కాక నిరంతరం కొనసాగించడం వారి ఆహార అలవాట్లు,  కుటుంబంలో సభ్యుల సంఖ్య, వంట అలవాట్లు, ఎల్ పి జి సిలిండర్ ధర,  ఉచిత వంట చెరకు మరియు ఆవు పేడ సులభంగా
లభ్యం కావడం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.  

వినియోగదారులకు అవసరం లేనప్పుడు లేక వారు కోరక ముందు ఎల్ పి జి రీఫిల్ బట్వాడా చేయవలసిందిగా చమురు మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లు పంపిణీదారులపై వత్తిడి తేవడం లేదని ఓ ఎం సిలు తెలిపాయి.  

పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సంగతి తెలిపారు.  


 

*****



(Release ID: 1654170) Visitor Counter : 209