పార్లమెంటరీ వ్యవహారాలు

సోమవారం (సెప్టెంబర్‌ 14వ తేదీ) నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు


అక్టోబర్‌ 1వ తేదీ వరకు వరుసగా 18 రోజుల పాటు సమావేశాలు; సభ ముందుకు 47 అంశాలు

సభ ముందుకు రానున్న పదకొండు ఆర్డినెన్స్‌ బిల్లులు

Posted On: 13 SEP 2020 2:58PM by PIB Hyderabad

సోమవారం (సెప్టెంబర్‌ 14వ తేదీ) నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి 17వ లోక్‌సభ నాలుగో సమావేశాలు, రాజ్యసభ 252వ సమావేశాలుగా నిలవనున్నాయి. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా, అక్టోబర్‌ 1వ తేదీ వరకు జరగనున్నాయి.

శని, ఆదివారాలు సహా వరుసగా 18 రోజులు సమావేశాలు జరుగుతాయి. మొత్తం 47 అంశాలు సభలో చర్చకు రానున్నాయి. ఇందులో 45 బిల్లులు, రెండు ఆర్థికాంశాలు ఉన్నాయి. 

ఆర్డినెన్స్‌ బిల్లులు:

(i) వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, వాణిజ్యం (పోత్సాహం, సౌకర్యం) బిల్లు-2020 
(ii) ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పందం-2020 
(iii) హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు-2020 
(iv) ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు-2020 
(v) అత్యవసర వస్తువుల (సవరణ) బిల్లు-2020 
(vi) దివాలా, బ్యాంక్‌ర‌ప్టసీ (రెండో) సవరణ బిల్లు-2020 
(vii) బ్యాంకు వ్యవహారాల నియంత్రణ (సవరణ) బిల్లు-2020 
(viii) పన్ను విధింపు, ఇతర చట్టాలు (కొన్ని నిబంధనల్లో సడలింపు) బిల్లు-2020 
(ix) అంటువ్యాధుల (సవరణ) బిల్లు-2020 
(x) మంత్రుల జీతభత్యాల (సవరణ) బిల్లు-2020
(xi) పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, పింఛను (సవరణ) బిల్లు-2020


రెండు సభల్లోని ఏదోక సభలో పెండింగ్‌లో ఉండి, ఈ సమావేశాల్లో చర్చకు రానున్న మరికొన్ని ముఖ్యమైన బిల్లులు:

(i) పురుగుమందుల నిర్వహణ బిల్లు-2020 
(ii) నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్‌సీఐఎం) బిల్లు-2019 (రాజ్యసభలో ఆమోదం) 
(iii) నేషనల్‌ కమిషన్ ఫర్ హోమియోపతి (ఎన్‌సీహెచ్) బిల్లు-2019 (రాజ్యసభలో ఆమోదం) 
(iv) ఆయుర్వేదం బోధన, పరిశోధన సంస్థ బిల్లు-2020 (లోక్‌సభలో ఆమోదం)
(v) ఎయిర్‌క్రాఫ్ట్‌ (సవరణ) బిల్లు-2020 (లోక్‌సభలో ఆమోదం)
(vi) కంపెనీల (సవరణ) బిల్లు-2020 
(vii) గర్భధారణపై వైద్య పరిభాష (సవరణ) బిల్లు-2020 (లోక్‌సభలో ఆమోదం)
(viii) అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు-2020 (లోక్‌సభలో ఆమోదం)
(ix) జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం బిల్లు-2020 
(x) జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం-2020
(xi) సమాచార సాంకేతిక చట్ట సంస్థల (సవరణ) బిల్లు-2020 (లోక్‌సభలో ఆమోదం)
(xii) అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు-2019 (లోక్‌సభలో ఆమోదం)
(xiii) ఆనకట్టల భద్రత బిల్లు-2019 (లోక్‌సభలో ఆమోదం)
(xiv) మేజర్ పోర్టుల అథారిటీ బిల్లు-2020
(xv) సామాజిక భద్రత, సంక్షేమంపై కోడ్ బిల్లు-2019
(xvi) వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ బిల్లు-2019
(xvii) పారిశ్రామిక సంబంధాల కోడ్ బిల్లు-2019


ఉభయ సభల ముందుకురానున్న మరికొన్ని కొత్త బిల్లులు:

(i) బైలేటెరల్‌ నెట్టింగ్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ బిల్లు-2020
(ii) ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు-2020
(iii) పీఎఫ్‌ నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (సవరణ) బిల్లు-2020
(iv) అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తులపై జాతీయ కమిషన్‌-2020
(v) అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (నియంత్రణ) బిల్లు-2020
(vi) దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వం (సవరణ) బిల్లు-2020
(vii) విదేశీ భాగస్వామ్యం (నియంత్రణ) సవరణ బిల్లు-2020
(viii) ప్రజా ప్రాతినిధ్యం (సవరణ) బిల్లు-2020
(x) జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, భద్రత) సవరణ బిల్లు-2020
(xi) బహుళ రాష్ట్రాల సహకార సంఘాలు (సవరణ) బిల్లు-2020
(xii) జమ్ము, కశ్మీర్ అధికార భాష బిల్లు-2020

ఈ సమావేశాల్లో ఉపసంహరించుకోనున్న కొన్ని బిల్లులు:

(i) అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తుల బిల్లు-2018
(ii) గనుల (సవరణ) బిల్లు-2011
(iii) అంతర్రాష్ట్ర వలస కూలీలు (ఉపాధి నియంత్రణ, సేవా పరిస్థితులు) సవరణ బిల్లు-2011
(iv) భవనాలు, ఇతర నిర్మాణ కార్మికుల సంబంధిత చట్టాల (సవరణ) బిల్లు-2013
(v) ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ (ఖాళీల కచ్చిత ప్రకటన) సవరణ బిల్లు-2013

 కొవిడ్‌ పరిస్థితుల్లో జరగనున్న పార్లమెంటు తొలి సమావేశాలివి. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని సమావేశాలు నిర్వహించనున్నారు.

ప్రతిరోజు కేవలం 4 గంటలు మాత్రమే సభ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు లోక్‌సభ జరుగుతుంది. తొలిరోజు (14వ తేదీన) మాత్రం, ఉదయం సెషన్‌లోనే లోక్‌సభ సమావేశమవుతుంది. ఉభయ సభల్లో సభ్యులు దూరదూరంగా కూర్చుంటారు. గ్యాలరీల్లోనూ సామాజిక దూరం పాటిస్తారు. ఎంపీల హాజరును నమోదు చేయడానికి మొబైల్‌ యాప్‌ రూపొందించారు. ఎంపీల సీట్ల మధ్య పాలీ-కార్బన్‌ షీట్లను అడ్డుగా ఉంచారు. 'జీరో అవర్' ఉంటుంది. నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలను టేబుల్‌ చేస్తారు.

 

*****

 


(Release ID: 1653886) Visitor Counter : 348