ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ అమలు - ఇప్పటివరకు పురోగతి


Posted On: 13 SEP 2020 10:31AM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 మే, 12వ తేదీన భారత దేశ జి.డి.పి. లో 10 శాతానికి సమానమైన 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక, సమగ్ర ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధి భారత్ ఉద్యమం కోసం ఆయన ఒక స్పష్టమైన పిలుపునిచ్చారు.  ఆత్మా నిర్భర్ భారత్ కు చెందిన ఐదు ముఖ్యమైన అంశాలుగా - ఆర్ధిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలూ, విధానాలు, సిస్టం, శక్తివంతమైన జనాభా, డిమాండు ల గురించి ఆయన వివరించారు.

గౌరవనీయులైన ప్రధానమంత్రి పిలుపు మేరకు, ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ 2020 మే 13వ తేదీ నుండి 2020 మే 17వ తేదీ వరకు వరుసగా నిర్వహించిన విలేకరుల సమావేశాలలో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. 

 ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన ప్రకటనలను ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు వెంటనే అమలు చేయడం ప్రారంభించాయి.  సాధారణ సమీక్షలు మరియు ఆర్థిక ప్యాకేజీ అమలును దాదాపు రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షించడాన్ని బట్టి, ఈ విషయమై, ప్రభుత్వం ఎంత తీవ్రంగా ఆలోచిస్తోందీ, తెలుసుకోవచ్చు.  

ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ద్వారా కొనసాగుతున్న పథకాల అమలులో ఇప్పటివరకు సాధించిన పురోగతి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :

1.రైతులకు నాబార్డ్ ద్వారా 30,000 కోట్ల రూపాయల మేర అదనపు అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ నిధుల కేటాయింపు : 2020 ఆగష్టు 28వ తేదీ నాటికి, 25 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు.  మిగిలిన 5,000 కోట్ల రూపాయలను, స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ (ఎస్‌ఎల్‌ఎఫ్) కింద, చిన్న ఎన్.‌బి.ఎఫ్.‌సి. లు మరియు, ఎన్.‌బి.ఎఫ్.‌సి-ఎం.ఎఫ్.‌ఐ. ల కోసం, భారతీయ రిజర్వు బ్యాంకు నాబార్డు కు కేటాయించింది.  ఈ మొత్తాన్ని త్వరలో విడుదల చేయడం కోసం నాబార్డు కార్యాచరణ మార్గదర్శకాలను ఖరారు చేస్తోంది.

దీనితో పాటు, రుణదాతల నుండి రుణాలు పొందడానికి వీలుగా, అన్ ‌రేటెడ్ ఎన్.‌బి.ఎఫ్.‌సి / ఎం.ఎఫ్.‌ఐ. లకు సహాయపడ్డం కోసం నాబార్డు రెండు ఏజెన్సీలు, మరియు బ్యాంకుల సహకారంతో స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ & పాక్షిక హామీ పథకాన్ని ప్రారంభించింది.

ఈ విధానం అటువంటి రెండు ఏజెన్సీలతో కలిసి పనిచేసింది. ఎటువంటి రేటింగ్ లేని చిన్న ఎమ్.ఎఫ్.ఐ. లకు రుణ అర్హతను 5 - 6 రెట్లు పెంచడం జరిగింది.  ఈ పథకం కోసం కేటాయించిన 500 కోట్ల రూపాయలూ పంపిణీ చేసిన అనంతరం, ఆ చిన్న ఎన్.‌బి.ఎఫ్.‌సి / ఎంఎఫ్‌ఐల ద్వారా క్రెడిట్ లభ్యత 2500 కోట్ల రూపాయల నుండి 3000 కోట్ల రూపాయలకు ప్రతిపాదించడం జరిగింది.  మారుమూల, ఎవరూ చేరుకోలేని ప్రాంతాల్లోని మహిళలను ప్రత్యేకంగా చేరుకోవడానికి ఇదొక మహదావకాశాన్ని కల్పించింది. 

2. ఎం.ఎస్.‌ఎం.ఈ. లు మరియు వ్యక్తులకు తాజా రుణాలు ఇవ్వడానికి ఎన్.‌బి.ఎఫ్.‌సి.లు, హెచ్.‌ఎఫ్.‌సి.లు మరియు ఎం.ఎఫ్.‌ఐ. ల కోసం 45,000 కోట్ల రూపాయల మేర పాక్షిక ఋణ హామీ పథకం 2.0 :2020 ఆగష్టు, 28వ తేదీ నాటికి, బ్యాంకులు 25,055.5 కోట్ల రూపాయల మేర పోర్ట్‌ఫోలియో కొనుగోలుకు బ్యాంకులు ఆమోదం తెలియజేశాయి.  ప్రస్తుతం, అవి, అదనంగా 4,367 కోట్ల రూపాయల కోసం ఆమోదం / చర్చల ప్రక్రియలో ఉన్నాయి. 

3.ఎన్.‌బి.ఎఫ్.‌సి. / హెచ్‌.ఎఫ్.‌సి. / ఎం.ఎఫ్.‌ఐ.ల కోసం 30,000 కోట్ల రూపాయల ప్రత్యేక లిక్విడిటీ పథకం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి వీలుగా ఎస్.‌పి.వి. ని ఏర్పాటు చేయవలసిందిగా ఎస్‌.బి.ఐ-క్యాప్ ను నియమించారు.  2020 జూలై,  1వ తేదీ నాటి పత్రికా ప్రకటన ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు.  అదే రోజు భారతీయ రిజర్వు బ్యాంకు కూడా ఈ పథకంపై ఎన్.బి.ఎఫ్.సి.లు మరియు హెచ్.ఎఫ్.సి.లకు ఒక ప్రకటన జారీ చేసింది.

2020 సెప్టెంబర్, 11వ తేదీ నాటికి, ముప్పై ఏడు (37) ప్రతిపాదనలకు గాను 10,590 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.  మరో 783.5 కోట్ల రూపాయల మేర ఆర్ధిక సహాయం కోసం, ఆరు (06) దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. 

4. ఎం.ఎస్.ఎం.ఈ.లతో సహా వ్యాపారాల కోసం 3 లక్షల కోట్ల రూపాయల మేర కొలాటరల్-ఫ్రీ ఆటోమేటిక్ రుణాలు : వ్యాపారానికి ఉపశమనం కలిగించడానికి, 2020 ఫిబ్రవరి, 29 తేదీ నాటికి, బకాయి ఉన్న రుణంలో 20 శాతం అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని, రాయితీ వడ్డీ రేటుతో టర్మ్ లోన్ రూపంలో అందించబడుతుంది.  25 కోట్ల రూపాయల వరకు బకాయి ఉండి, 100 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ఉండి, ఖాతాలు ప్రామాణికంగా ఉన్న యూనిట్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.  యూనిట్లు తమ సొంత హామీ లేదా అనుషంగికను అందించాల్సిన అవసరం లేదు. 45 లక్షలకు పైగా ఎం.ఎస్.‌ఎం.ఈ. లకు చెందిన మొత్తం 3 లక్షల కోట్ల రూపాయల లిక్విడిటీ తో భారత ప్రభుత్వం ఈ మొత్తానికి నూరు శాతం హామీ ఇస్తుంది. 

2020 మే నెల 20వ తేదీన మంత్రిమండలి ఆమోదం పొందిన తరువాత, ఆర్థిక సేవల విభాగం 2020 మే నెల 23వ తేదీన ఈ పథకానికి నిర్వహణ పరమైన మార్గదర్శకాలను జారీ చేసింది.  అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పధకం (ఈ.సి.ఎల్.‌జి.ఎస్) నిధి 2020 మే నెల 26వ తేదీన నమోదయ్యింది.  వ్యాపారం కోసం వ్యక్తిగత రుణాలు, రుణ బకాయి పరిమితిని 50 కోట్ల రూపాయలకు, వార్షిక టర్నోవర్ పరిమితిని 250 కోట్ల రూపాయలకు పెంచడానికి వీలుగా 2020 ఆగష్టు, 4వ తేదీన మార్గదర్శకాలను సవరించడం జరిగింది. 

2020 సెప్టెంబర్, 10 తేదీ నాటికి దేశంలోని 23 ప్రైవేట్ రంగ బ్యాంకులు 42,01,576 మంది రుణగ్రహీతలకు 1,63,226.49 కోట్ల రూపాయల మేర అదనపు రుణాలను మంజూరు చేశాయి. కాగా, 2020 సెప్టెంబర్, 10వ తేదీ నాటికి, వీటిలో 1,18,138.64 కోట్ల రూపాయల మేర మొత్తాన్ని, 25,01,999 మంది రుణ గ్రహీతలకు పంపిణీ చేశాయి.  

5. ఆదాయ పన్ను వాపసు : 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 సెప్టెంబర్ 8వ తేదీ మధ్య కాలంలో 27.55 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు 1,01,308 కోట్ల రూపాయలకు పైగా పన్ను వాపసు ఇవ్వడం జరిగింది.   ఆదాయపన్ను రిఫండ్ కింద 25,83,507 కేసులకు, 30,768 కోట్ల రూపాయల మేర, కార్పొరేట్ పన్ను రిఫండ్ కింద 1,71,155 కేసులకు, 70,540 కోట్ల రూపాయలు జారీ చేయడం జరిగింది.  వాస్తవానికి, 50 కోట్ల రూపాయల వరకు బకాయి ఉన్న అన్ని కేసులలోనూ కార్పొరేట్ పన్ను రిఫండ్ లు జారీ చేయడం జరిగింది.  మిగిలిన చెల్లింపులు పరిశీలనలో ఉన్నాయి. 

 

 

*****

 



(Release ID: 1653860) Visitor Counter : 357