వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

స్టార్టప్.ల వ్యవస్థకు మద్దతుపై 2019వ సంవత్సరపు రాష్ట్రాల ర్యాంకుల ప్రకటన

Posted On: 11 SEP 2020 5:36PM by PIB Hyderabad

స్టార్టప్ ఎర్పాటు వ్యవస్థలపై రాష్ట్రాల ర్యాంకింగ్ కు సంబంధించి రెండవ భాగం ఫలితాలు విడుదలయ్యాయి. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ రోజు వర్చువల్ సత్కార కార్యక్రమంలో ర్యాంకింగ్స్ విడుదల చేశారు. వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయమంత్రి, పౌర విమానయానం, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల స్వతంత్ర హోదా సహాయ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి, వాణిజ్యం, పరిశ్రమల సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ సమక్షంలో  కార్యక్రమం జరిగింది.

    రాష్టాల్లో స్టార్టప్ ర్యాంకింగ్ ప్రక్రియ రెండవ విడత కార్యక్రమాన్ని పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖ (డి.పి...టి.) నిర్వహించింది. స్టార్టప్ ఏర్పాటుకు సానుకూల పరిస్థితులను మరింత మెరుగుపరిచే విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పోటీ తత్వంతో, క్రియాశీలకంగా పనిచేసేలా ప్రోత్సహించే ప్రధాన లక్ష్యంతో ప్రక్రియను నిర్వహించారు. స్టార్టప్ విషయంలో అన్ని రాష్ట్రాల సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా, విధాన రూపకల్పన, అమలుకు మద్దతు ఇచ్చేందుకు ప్రక్రియను చేపట్టారు.

   2019 సంవత్సరానికి సంబంధించి, రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ వ్యవస్థలో స్థూలంగా 7 అంశాలు, 30 కార్యశీలక సూత్రాలు ఉన్నాయి. సంస్థాగతమైన మద్దతు, పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ నిబంధనలల్లో సడలింపు, ఇంక్యుబేషన్ సపోర్ట్, సీడ్ ఫండింగ్ సపోర్ట్, వెంచర్ ఫండింగ్ సపోర్ట్ తదితర అంశాలు కార్యశీలక సూత్రాల పరిధిలోకి వస్తాయిర్యాంకింగ్ ప్రక్రియలో సమానత్వం, ప్రమాణీకరణను సాధించేందుకు వివిద రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను రెండు గ్రూపులుగా విభజించారు. ఢిల్లీ మినహా మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు, అస్సాం మినహా ఈశాన్యంలోని మిగతా రాష్ట్రాలనువైకేటగిరీలోకి చేర్చారు. మిగతా అన్ని రాష్ట్రాలను, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్నిఎక్స్కేటగిరీలోకి చేర్చారు.

  మొత్తం 22రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రక్రియలో పాలుపంచుకున్నాయి. స్వంతంత్ర ప్రతిపత్తికలిగిన నిపుణులు వివిధ ప్రమాణాల ప్రాతిపదికన వచ్చే ప్రతిస్పందన ఆధారంగా సవివరంగా  ర్యాంకులను మదింపు చేశారు. స్టార్టప్ ఏర్పాటుకు సంబంధించి వాస్తవ పరిస్థితిని, అమలు స్థాయిని అంచనా వేసేందుకు లబ్ధిదారులనుంచి నిపుణులు అభిప్రాయాలను సేకరించారు. లబ్ధిదారులతో స్పష్టమైన అనుసంధానం కోసం 11రకాల విభిన్న భాషల్లో 60వేల ఫోన్ కాల్స్ చేశారు.

  ర్యాంకింగ్ ప్రక్రియకోసం రాష్ట్రాలను ఐదు కేటగిరీలుగా వర్గీకరించారు. అగ్రశ్రేణి పనితీరు, ఉత్తమమైన పనితీరు, ఆధిక్యం కనబరచడం, ఆధిక్యంకోసం ఆశావహంగా ఉండటం, ఆవిర్భవిస్తున్న స్టార్టప్ వ్యవస్థలు  వంటి కేటగిరీలుగా రాష్ట్రాలను వర్గీకరించారు. ప్రతి కేటగిరీలోను ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం ఆయా రాష్ట్రాల పేర్లను పొందుపరిచారు. స్టార్టప్ లకు మద్దతుకు సంబంధించి 7 అంశాల ప్రాతిపదికన కూడ రాష్ట్రాలను ఆధిక్యతను గుర్తించారు. ఫలితాలను కూడా అనుసంధానించారు.

  ర్యాంకింగ్ ప్రక్రియకు సంబంధించిన సత్కార కార్యక్రమం అనంతరం ఒక జాతీయ నివేదికను కూడా విడుదల చేశారు. రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ కసరత్తు వెనుక ఉన్న దార్శనికత, విధానం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ప్రధానంగా ప్రస్తావిస్తూ జాతీయ నివేదికను రూపొందించారు. పోటీలో పాల్గొన్న 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి, ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేక నివేదికను కూడా విడుదల చేశారు. భవిష్యత్తు ప్రణాళికకోసం ఆయా రాష్ట్రాల బలాబలాలు, ప్రాధాన్యతా రంగాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ నివేదికలను రూపొందించారు.

  స్టార్టప్ కంపెనీలకు మద్దతు ఇవ్వడంలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన విధానాలపైమంచి పద్ధతుల సంక్షిప్త నివేదికను కూడా విడుదల చేశారు. స్టార్టప్ ఏర్పాటుకు వివిధ రాష్ట్రాలు నేరుగా వినియోగించిన 166 మంచి విధానాలతో నివేదిక తయారైంది.

  రోజు ఆవిష్కరించిన జాతీయ నివేదికను, వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రత్యేక నివేదికలను స్టార్టప్ ఇండియా పోర్టల్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

   సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ,..స్టార్టప్ కంపెనీలు పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రూపొందినవన్నారు. ప్రజల బాగుకోసం ఉద్యోగాల కల్పన, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ వంటి అంశాలకు ప్రోత్సాహం అందించే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రధానమంత్రి ఎంతగానో ప్రశంసిస్తారని, వారికి అండగా నిలుస్తారని గోయెల్ అన్నారు.

   స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు సహకార స్ఫూర్తి, పోటీ తత్వంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం నిజంగా చాలా ముఖ్యమైన పరిణామమని మంత్రి అన్నారు. x ప్రతిభ, విజ్ఞానం, వినూత్న ఆలోచనలకు మద్దతుకు నిలయాలని గోయెల్ అభివర్ణించారు. ర్యాంకింగ్ ప్రక్రియ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దోహదపడుతుందని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తుందని, స్టార్టప్ విస్తరణకు, కొత్త సంస్థల ప్రారంభానికి ఉపకరిస్తుందని అన్నారు. స్టార్టప్ కంపెనీల ఏర్పాటులో మహిళలు చురుకుగా పాలుపంచుకోవడం చాలా ప్రోత్సాహకరమైన పరిణామమన్నారు.

    స్టార్టప్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధిని ఏర్పాటు చేయడం, రాష్ట్రాలు కూడా అదే మార్గంలో ముందుకు సాగడం హర్షదాయకమన్నారు. స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు ముందుకు రావాలని వ్యక్తులను, వెంచర్ క్యాపిటలిస్టులను ఆయన కోరారు. కాలానికి తగినట్టుగా, సృజనాత్మక ఉత్పాదనల తయారీకి స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలన్నారు. తయారీ ప్రక్రియలో సంస్కరణలకోసం కృషి చేయాలని, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేలా స్టార్టప్ ఆలోచనలు సాగాలని మంత్రి సూచించారు. కోవిడ్ మహమ్మారిని సమస్యగానో, సవాలుగానో పరిగణించరాదని, భారతదేశాన్ని బలమైన శక్తితో పునరుజ్జీవింప జేయడానికి అందివచ్చిన అవకాశంగా భావించాలని మంత్రి ఉద్బోధించారు. కోవిడ్ కాలంలో మనదేశం, ప్రపంచం ఎదుర్కొన్న సమస్యలపై మన స్టార్టప్ కంపెనీలు ఎంతో గొప్ప ఆలోచనలు, పరిష్కారాలతో ముందుకు వచ్చాయన్నారు.

  మంత్రి హర్ దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన సమాజాలు,..ఔత్సాహిక పారిశ్రామిక రంగం ప్రోత్సాహానికి, సమస్యలకు తగిన పరిష్కారాల రూపకల్పనకు కృషిచేశాయన్నారు. 2024 సంవత్సరానికల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఎదగాలంటే స్టార్టప్ కంపెనీల సానుకూల వ్యవస్థ బలంగా వేళ్లూనుకోవలసి ఉందన్నారు. మన ప్రజల ఆలోచనా విధానం మారుతోందని, ఉద్యోగాల వేటనుంచి, ఉద్యోగాల కల్పన స్థాయికి జనం ఎదగడం హర్షదాయకమని మంత్రి అన్నారు.

  మరో మంత్రి సోమ్ ప్రకాశ్ మాట్లాడుతూ, యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ర్యాంకింగ్ ప్రక్రియ ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుందని, వారు వ్యాపారం ప్రారంభించేందుకు ఉపకరిస్తుందని అన్నారు. స్టార్టప్ సానుకూల వ్యవస్థల రూపకప్లనలో మనదేశం ప్రపంచంలోనే 3 స్థానానికి  చేరుకుందన్నారు.

    డి.పి...టి. కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర మాట్లాడుతూ,.. స్టార్టప్ సానుకూల వ్యవస్థ వల్ల దేశంలో 4లక్షలకుపైగా ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. ర్యాంకింగ్ ప్రక్రియ సహకార సమాఖ్యకు నిదర్శనమని, రాష్ట్రాల సామర్థ్యాలను పాదుకొల్పడంలో ఇది దోహదపడుతుందని అన్నారు.

 స్టార్టప్ ర్యాంకింగ్ ప్రకటనపై కార్యక్రమంకోసం లింక్ ను క్లిక్ చేయండి.... https://www.youtube.com/watch?v=pKGMTItOTXU&feature=youtu.be

***

 

  .



(Release ID: 1653499) Visitor Counter : 256