కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురయ్యే సాధారణ సమస్యలకు కలిసికట్టుగా పరిష్కారాలు సాధిద్దాం : జి-20 దేశాల కార్మిక, ఉపాధి శాఖ మంత్రుల సమావేశంలో శ్రీ గంగ్వార్ ప్రసంగం
Posted On:
11 SEP 2020 12:54PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి ఫలితంగా తలెత్తుతున్న సాధారణ సమస్యలకు పరిష్కార మార్గాల కోసం జి -20 సభ్యులందరూ కలిసి పనిచేయాలని కార్మిక, ఉపాధి శాఖ (ఇంచార్జి) మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్ పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిన్న సాయంత్రం జి -20 కార్మిక, ఉపాధి మంత్రుల వర్చువల్ సమావేశంలో శ్రీ గంగ్వర్ మాట్లాడారు.
కోవిడ్-19 మనం సాధారణంగా సాగించే పని విధానాన్నే మార్చివేసిందని అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని నిలువరించడానికి ప్రాంతీయ నిర్దిష్ట చర్యలను ప్రస్తావిస్తూ, కార్మికుల సమస్యలను తగ్గించడానికి, భారతదేశం తన కార్మికులకు ఆయా యాజమాన్యాలు వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. వలస కూలీలకు తాత్కాలిక ఆశ్రయాలు, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు శ్రీ గంగ్వార్ తెలిపారు. వలస కార్మికులకు ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి, భారత ప్రభుత్వం ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు పథకాన్ని ప్రారంభించినట్లు శ్రీ గంగ్వార్ తెలియజేశారు. కోవిడ్-19, దాని ప్రభావం G20 లో కూడా చర్చించడం జరిగిందని, కార్మిక వర్గంపై ఆ ప్రభావాన్ని తగ్గించే చర్యలను కూడా డిక్లరేషన్ జాబితాలో చేర్చామని అన్నారు.
జి 20 యూత్ రోడ్‌మ్యాప్ 2025 ను అభివృద్ధి చేయడంలో సౌదీ ప్రెసిడెన్సీ చేసిన కృషిని శ్రీ గంగ్వార్ ప్రశంసించారు. జి 20 ఫోరమ్‌లో తొలిసారిగా గుర్తించబడిన యువతకు సంబంధించిన సూచికలు యువజన శ్రామిక వర్గాల పురోగతి ఫలితాలను అంచనా వేయడానికి మనకు సహాయపడతాయని అన్నారు. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం యువత అభివృద్ధికి దోహదపడుతుందని తాము విశ్వసిస్తామని శ్రీ గంగ్వార్ చెప్పారు. భారతదేశంలో సామాజిక భద్రత కవరేజ్ సమర్థవంతమైన, ఆర్ధికంగా ఉపయోగపడే సహాయక వ్యవస్థ ద్వారా అందించబడుతుందని ఆయన అన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం కోసం, భారతదేశం ఒక ప్రత్యేకమైన స్వచ్ఛంద పెన్షన్ పథకాన్ని ప్రారంభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. సమానత్వానికి ఈ సారి కూడా జి20 సమావేశం పెద్దపీట వేయడం ప్రశంసనీయమని శ్రీ గంగ్వార్ అన్నారు.
******
(Release ID: 1653285)
Visitor Counter : 221