వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

అంకుర సంస్థ‌ల‌ ఎకోసిస్ట‌మ్స్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన రాష్ట్రాలకు రేపు ర్యాంకింగ్‌ ప్ర‌క‌ట‌న

Posted On: 10 SEP 2020 1:56PM by PIB Hyderabad

అంకుర సంస్థ‌ల‌ ఎకోసిస్ట‌మ్స్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన రాష్ట్రాల ర్యాంకింగ్ రెండో ఎడిష‌న్ ఫ‌లితాల‌ను రేపు (సెప్టెంబర్ 11 న) ప్ర‌క‌టించ‌నున్నారు. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు న్యాయ శాఖ‌ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 3 గంటలకు న్యూ నేషనల్ మీడియా సెంటర్లో వీటిని విడుదల చేయనున్నారు. వర్చువల్ సత్కార కార్యక్రమంగా జ‌రుగ‌నున్న ఈ ర్యాంకింగ్‌ విడుద‌ల కార్య‌క్ర‌మం రైల్వేశాఖ‌, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ సమక్షంలో జ‌రుగ‌నుంది. కేంద్ర పౌర విమానయాన, గృహ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్) శ్రీ హర్దీప్ సింగ్ పూరి, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాశ్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన‌నున్నారు. రాష్ట్రాల‌కు ర్యాంకింగ్ ఫలితాల ప్ర‌క‌ట‌న‌ కార్య‌క్ర‌మం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జ‌రుగ‌నుంది. ఇందులో ఆయా రాష్ట్రాలు మరియు యుటీల‌కు చెందిన మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన‌నున్నారు.
పోటీతత్వాన్ని పెంపొందించేందుకు..
అంకుర సంస్థ‌ల‌ను (స్టార్ట‌ప్‌) ప్రోత్స‌హించే విష‌య‌మై రాష్ట్రాల మ‌ధ్య మేటి పోటీతత్వాన్ని పెంపొందించే ముఖ్య లక్ష్యంతో 'డిపార్ట్‌మెంట్ ఫ‌ర్ ప్ర‌మోష‌న్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్' (డీపీఐఐటీ) రెండో ఎడిష‌న్ ర్యాంకింగ్ క‌స‌ర‌త్తు ప్ర్రక్రియ‌ను చేప‌ట్టింది. స్టార్టప్ సంస్థ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణాన్ని ఉద్ధరించే దిశగా చురుకుగా పని చేయడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను డీపీఐఐటీ ప్రోత్సహిస్తుంది. రాష్ట్రాల మధ్య పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి మరియు విధాన రూపకల్పన, దాని అమలులో సహాయాన్ని అందించడానికి సామర్థ్య అభివృద్ధి ప్ర‌క్రి‌య‌కు క‌స‌రత్తుగా ర్యాంకింగ్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌బ‌డుతోంది. రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్- 2019 లో సంస్థాగత మద్దతు, సడలింపు సమ్మతి, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ నిబంధనలలో సడలింపు, ఇంక్యుబేషన్ సపోర్ట్, సీడ్ ఫండింగ్ సపోర్ట్, వెంచర్ ఫండింగ్ సపోర్ట్, మరియు అవేర్‌నెస్ & అవుట్ రీచ్‌ వంటి 30 యాక్షన్ పాయింట్లతో కూడిన 7 విస్తృత సంస్కరణ ప్రాంతాలు ఉన్నాయి. ర్యాంకింగ్ ప్రక్రియలో ఏకరూపతను స్థాపించడానికి, ప్రామాణీకరణను నిర్ధారించడానికి, రాష్ట్రాలు మరియు యుటీలను రెండు గ్రూపులుగా విభజించారు. కేంద్ర‌పాలిత ప్రాంతాల విభాగంలో ఢిల్లీని మిన‌హాయించారు. అస్సాం మిన‌హాయించి ఈశాన్య భారతంలోని అన్ని రాష్ట్రాల‌ను ఒక గ్రూపుగా చేర్చారు. మిగతా రాష్ట్రాలన్నింటిని మ‌రో గ్రూపులో చేర్చారు. మొత్తం ఇర‌వై రెండు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ర్యాంకింగ్ క‌స‌ర‌త్తులో పాల్గొన్నాయి. స్టార్టప్‌ల‌ పర్యావరణ వ్యవస్థ నుండి స్వతంత్ర నిపుణులతో కూడిన మూల్యాంకన కమిటీ, వివిధ పారామితులలో ప్రతిస్పందనల యొక్క వివరణాత్మక అంచనాను నిర్వహించింది. లబ్ధిదారుల నుండి అభిప్రాయాన్ని పొందడంతో పాటు అనేక పారామితులున్నాయి. దాదాపుగా 11 వేర్వేరు భాషలలో 60,000 కన్నా ఎక్కువ కాల్స్ ద్వారా అభిప్రాయాలు సేకరించబడ్డాయి. ఇది లబ్ధిదారులతో సానుభూతితో కనెక్ట్ అవ్వడానికి అమలు స్థాయిలలో నిజమైన పల్స్‌ను తెలుసుకోవడానికి ఎంత‌గానో దోహదం చేసింది.

                           

******


(Release ID: 1653161) Visitor Counter : 180