ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత 73వ సదస్సుకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరైన - డాక్టర్ హర్ష వర్ధన్
"ఆరోగ్యంపై పెట్టుబడులు పెట్టడం అనేది ఒక దేశం తన ప్రజల కోసం చేయగల అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన పెట్టుబడి" అన్న ప్రధానమంత్రి ఆలోచనను తెలియజేసిన - డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 09 SEP 2020 3:04PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఈరోజు, ఇక్కడ, కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే తో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత 73వ సదస్సుకు ఆన్ లైన్ ద్వారా హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ పూనమ్ క్షేత్రపాల్ సింగ్ కూడా పాల్గొన్నారు.

రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం కోవిడ్ మహమ్మారి కారణంగా పూర్తిగాఆన్ లైన్ విధానంలో జరగడం ఇదే మొదటిసారి.  ఇప్పుడు 73వ సదస్సుకు థాయిలాండ్ ప్రభుత్వం (బ్యాంకాక్ నుండి) ఆతిధ్యమిస్తుండగా, ఇంతకు ముందు నిర్వహించిన సదస్సు న్యూఢిల్లీ లో జరిగింది.  72 వ సదస్సు అధ్యక్షుని హోదాలో డాక్టర్ హర్ష వర్ధన్ ముందుగా ఆహూతులనుద్దేశించి ప్రసంగించిన అనంతరం కొత్త చైర్మన్, థాయ్‌లాండ్ ఉప ప్రధాన మంత్రి మరియు ఆరోగ్య మంత్రి శ్రీ అనూతిన్  చర్నవిరాకుల్ కు బాధ్యతలు అప్పగించారు. ఆతర్వాత, భారతదేశం తరపున, సదస్సుకు హాజరైన ప్రముఖులను ఉద్దేశించి, డాక్టర్ హర్ష వర్ధన్ ప్రసంగించారు.

పదవి నుండి వైదొలుగుతున్న చైర్మన్ గా సదస్సునుద్దేశించి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రసంగిస్తూ,  కోవిడ్ -19 కారణంగా ఆగ్నేయాసియా వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయినవారికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.   ఈ ప్రాంతంలోని ధైర్యవంతులైన ఫ్రంట్ ‌లైన్ కార్మికులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "వారి స్వంత భద్రత మరియు శ్రేయస్సును పణంగా పెట్టి, చేపట్టిన సమిష్టి ప్రయత్నాలు - ప్రాణాలను రక్షించడంలో సహాయపడటమే కాక, ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరి క్షేమాన్నీ చూసుకోవడంలో వారి దృఢనిశ్చయానికి అద్దం పట్టాయి." అని ఆయన పేర్కొన్నారు. 

అటువంటి ప్రాంతీయ కమిటీ వేదికల యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ హర్ష వర్ధన్ ఎత్తిచూపారు.  "మన సమిష్టి ప్రయత్నాల ఫలితంగా సాధించిన పురోగతిని హైలైట్ చేయడానికి మాత్రమే కాక, ప్రాంతీయ మరియు ప్రపంచ ప్రజారోగ్య సమస్యలను మరింత ముందుకు తీసుకువెళ్ళే మార్గాన్ని చర్చించడంలో కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ” అని ఆయన వివరించారు.  ఆగ్నేయాసియా ప్రాంతం, దాని 11 సభ్య దేశాలతో, ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తోంది.  మరియు ఈ ప్రాంతంలోని సభ్య దేశాల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం మూడు బిలియన్ లక్ష్యం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు రెండింటినీ సాధించడంలో ప్రపంచ ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  "అందరికీ ఆరోగ్యం" అనే మన ఉమ్మడి లక్ష్యం వేలాది మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ మనందరినీ ఏకం చేస్తుంది, మరియు ఈ లక్ష్యం ఈ రోజు ప్రాంతీయ ఆరోగ్యంపై మన కృషిని ప్రేరేపిస్తుంది," 

అని పేర్కొంటూ, సమీప భవిష్యత్తులో వారిని వ్యక్తిగతంగా మరియు సురక్షితంగా కలవాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. 

ఈ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో దేశం సాధించిన భారీ ప్రగతిని ఎత్తిచూపారు.  దేశ పౌరుల జీవితాలను, జీవనోపాధిని మహమ్మారి నుండి కాపాడటం కోసం, "వైరస్ ను కట్టడి చేయడానికీ, వ్యాప్తిని తగ్గించడానికీ అందుబాటులో ఉన్న ఏ ప్రయత్నాన్నీ వదిలివేయలేదు." అని పేర్కొన్నారు. 

తన ఆరోగ్య లక్ష్యాలను నిలబెట్టుకోవటానికి భారతదేశ నిబద్ధత గురించి ఆయన మాట్లాడుతూ, జాతీయ ఆరోగ్య విధానం 2017 గురించి వివరించారు. ఇది భారతదేశ పౌరులకు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అదేవిధంగా, 2018 లో ప్రారంభించబడిన ఆయుష్మాన్ భారత్ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దిశగా ఒక ముఖ్యమైన సంఘటన అనీ, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రాయోజిత ఉచిత ఆరోగ్య సంరక్షణ హామీ కార్యక్రమమనీ, ఆయన పేర్కొన్నారు.  ప్రజలకు నాణ్యమైన, అవసరమైన ఔషధాలను తక్కువ ఖర్చుతో అందించే జన్ ఔషధీ కేంద్రాలుగా పిలువబడే మందుల దుకాణాలతో భారతదేశం అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఆయన ప్రేక్షకులకు గుర్తు చేశారు.

"పోలియో వ్యాధి, మాతా, శిశువులకు సోకే ధనుర్వాతం, యాస్ అనే చర్మ రోగం మొదలైన వ్యాధుల తొలగింపు వంటి ముఖ్యమైన విజయాలతో పాటు, మాతా, శిశు మరణాల విషయంలో గణనీయమైన తగ్గింపు" గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి సభ్య దేశాలకు తెలియజేశారు.  ప్రపంచ లక్ష్యానికి ఐదేళ్ల ముందే 2025 నాటికి క్షయ నిర్మూలనకు భారతదేశ ప్రతిష్టాత్మక లక్ష్యం గురించి ఆయన వారికి తెలియజేశారు.  అదేవిధంగా, శోషరస ఫైలేరియాసిస్ మరియు కాలా-అజార్ వంటి నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను తొలగించడానికి భారతదేశ నిబద్ధత గురించి కూడా ఆయన చెప్పారు. 

ఆరోగ్య పరిపాలన యొక్క బహుముఖ మరియు బహుళ-రంగాల స్వభావం గురించి మాట్లాడుతూ, పరిష్కారాలు, వనరులు మరియు స్పష్టమైన ప్రయోజనాలను అందించడానికి జోక్యం చేసుకోవటానికి అనుసంధానం కావాలని డాక్టర్ హర్ష వర్ధన్ కోరారు.  "స్వచ్ఛ భారత్ అభియాన్, 2022 నాటికి అందరికీ గృహనిర్మాణం, పౌష్టికాహార మిషన్, నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ నగరాలు,  ఈట్ రైట్ ఇండియా, ఫిట్ ఇండియా మరియు ఇలాంటి అనేక బహుళ-రంగాల కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి, ఇవి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పరంగా డివిడెండ్లను తీసుకువస్తున్నాయి. ఫలితంగా వారి ఆరోగ్య పరిస్థితిని పెంపొందిస్తున్నాయి." అని ఆయన వివరించారు. 

“ఆరోగ్యం అనేది ఒక దేశం తన ప్రజల కోసం చేయగలిగే అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన పెట్టుబడి” అన్న ప్రధానమంత్రి భావనను డాక్టర్ హర్ష వర్ధన్ వివరిస్తూ, జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ యొక్క ప్రయోజనాలపై ఆయన మాట్లాడారు.  ఇది దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను సజావుగా అందించేలా చూడటానికి భారతీయ పౌరులకు ప్రత్యేకమైన ఆరోగ్య ఐడిలు, డిజిటల్ ఆరోగ్య రికార్డులతో పాటు వైద్యుల నమోదు పట్టిక మరియు ఆరోగ్య సౌకర్యాలను కలిగి ఉండటానికి డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటును పరిశీలించడం జరిగింది.  డాక్టర్ హర్ష్ వర్ధన్ తన ప్రసంగాన్ని ముగిస్తూ, "ఈ రోజు ఇక్కడ సమావేశమైన మనమందరం, ఆరోగ్య సంరక్షణలో ఎక్కువ పెట్టుబడులను ప్రభావితం చేయగల మరియు సేకరించగల స్థితిలో ఉన్నాము." అని పేర్కొన్నారు. 

*****(Release ID: 1652791) Visitor Counter : 17