రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

భ‌‌గల్పూర్, వారణాసిల‌లో రెండు కొత్త సీఎస్‌టీఎస్‌ కేంద్రాలను ప్రారంభించనున్న సిపెట్‌

Posted On: 08 SEP 2020 3:43PM by PIB Hyderabad

రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజి‌నీరింగ్ & టెక్నాలజీ' (సిపెట్) త్వరలో భ‌‌గల్పూర్ (బీహార్) మరియు వారణాసి (యూపీ) వద్ద నైపుణ్య‌త మ‌రియు సాంకేతిక స‌హాయం కోసం రెండు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. పెట్రోకెమికల్స్ మరియు అనుబంధ పరిశ్రమలలో లాభదాయకమైన ఉపాధి కోసం ప్రతి సంవత్సరం 1000 మంది యువతకు డిప్లొమా & స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రతి కేంద్రాల్లో శిక్షణ ఇవ్వ‌నున్న‌ట్టుగా కెమికల్స్, పెట్రో కెమికల్స్ శాఖ కార్యదర్శి శ్రీ ఆర్.కె.చతుర్వేది తెలిపారు. ఈ కేంద్రాలు అందించే సాంకేతిక సహాయ సేవలు ఈ ప్రాంతంలో కొత్త మరియు ఇప్పటికే అందుబాటులో ఉన్న పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తాయి. ప్రస్తుతం సిపెట్ 43 కార్యాచరణ కేంద్రాలను కలిగి ఉంది. పాలిమర్ మరియు అనుబంధ పరిశ్రమల అవసరాలను తీర్చడానికి వీలుగా దేశవ్యాప్తంగా మరో 9‌ కేంద్రాల‌ను కొత్త‌గా స్థాపించాల‌ని యోచిస్తున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్ దేశానికి అంకితభావంతో 50 సంవత్సరాల‌ను పూర్తి చేసింది. ప్ర‌స్తుతం 31 స్కిల్లింగ్ అండ్ టెక్నాల‌జీ స‌పోర్ట్ సీఎస్‌టీ సెంట‌ర్స్ (సీఎస్‌టీఎస్‌)
కేంద్రాల‌ను క‌లిగి ఉంది. పాలిమ‌ర్స్ సైన్స్‌, ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ రంగానికి సంబంధించి, డిప్ల‌మా, పీజీ డిప్లమా, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ శిక్ష‌ణ‌ కార్య‌క్ర‌మాల‌ను ఇక్క‌డ నిర్వ‌హిస్తున్నారు.
సిపెట్ స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ అభియాన్, స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా వంటి వివిధ భార‌త ప్ర‌భుత్వపు కార్య‌క్ర‌మాల‌కు చురుకుగా సహకరిస్తోంది. సిపెట్ లక్షల కంటే ఎక్క‌వ మంది విద్యార్థులను కలిగి ఉంది. ఉత్తీర్ణులైన వారు ప్రతి సంవత్సరం రోజూ నమోదు చేయబడతారు. ప్ర‌పంచ వ్యాప్తంగా  ఉనికిని క‌లిగి ఉండ‌డం, కీలక పదవులను ఆక్రమించడం మరియు వ్యవస్థాపకత త‌దిత‌రాలు సిపెట్ యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు.

***



(Release ID: 1652449) Visitor Counter : 109