ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

5 కోట్ల కొవిడ్ పరీక్షలతో కొత్త శిఖరాలను చేరుకున్న భారత్

ప్రతి మిలియన్ మందిలో పరీక్షలు జరిగిన వారి సంఖ్యలో కొనసాగుతున్న పెరుగుదల, నేడు ఆ సంఖ్య 36,073 కి చేరిక

Posted On: 08 SEP 2020 12:27PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఉధృతంగా విస్తృతమైన పరీక్షలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశం మరో శిఖరాగ్రాన్ని చేరుకుంది.  మొత్తం సంచిత పరీక్షలు ఈ రోజు 5 కోట్లను అధిగమించాయి. 2020 జనవరిలో పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని ల్యాబ్ నుండి కేవలం ఒక పరీక్షను నిర్వహించడం నుండి భారతదేశం చాలా దూరం అంటే నేడు 5,06,50,128 పరీక్షలు పూర్తి చేసిన స్థాయి వరకు వచ్చింది. గత 24 గంటల్లో 10,98,621 పరీక్షలు జరిగాయి. నిర్వహించిన సగటు రోజువారీ పరీక్షలు (వారం వారీగా) స్థిరమైన పెరుగుదలను ప్రదర్శిస్తున్నాయి. ఇది జూలై మూడవ వారం (3,26,971) నుండి సెప్టెంబర్ మొదటి వారం (10,46,470) వరకు 3.2 రెట్లు విస్తరించింది.

 

అనుమానిత కేసుల విషయంలో నిరంతర దృష్టి పెట్టాలంటే ఒక్కో మిలియన్ మందిలో రోజుకు కనీసం 140 మందికి పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అన్ని దేశాలకు సూచించింది. తన మార్గదర్శక పత్రం "కోవిడ్-19 నేపథ్యంలో ప్రజారోగ్యం, సామజిక చర్యలు చేపట్టడానికి ప్రజారోగ్య ప్రమాణాలు"లో ఈ విషయాలను స్పష్టం చేసింది. 

 

WhatsApp Image 2020-09-08 at 10.54.05 AM.jpeg

డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ల నెట్‌వర్క్‌ను విస్తరించడం టెస్ట్‌ల సంఖ్య పెరగడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. జూలై 1 న 6396 నుండి నేటికి 36,703 కు మిలియన్ లో టెస్టులు జరిగిన వారి సంఖ్య పెరిగింది. 

దేశంలో టెస్టింగ్ ల్యాబ్ నెట్‌వర్క్ నిరంతరం బలోపేతం అవుతుంది, ఈ రోజుకి దేశంలో 1668 ల్యాబ్‌లు ఉన్నాయి; ప్రభుత్వ రంగంలో 1035 ల్యాబ్‌లు, 633 ప్రైవేట్ ల్యాబ్‌లు. వీటిలో ఇవి ఉన్నాయి: 

• రియల్ టైమ్ ఆర్టీ పీసీఆర్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు: 846 (ప్రభుత్వం: 467 + ప్రైవేట్: 379) 

• ట్రూనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 700 (ప్రభుత్వం: 534 + ప్రైవేట్: 166) 

• సీబీనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 122 (ప్రభుత్వం: 34 + ప్రైవేట్: 88)

 

కోవిడ్-19కి ససంబంధించి ఖచితమైన, తాజా సమాచారాన్ని, మార్గదర్శకాలు, సూచనలను తెలుసుకోడానికి ఈ లింక్ చుడండి. 

https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA.

కోవిడ్-19 కి సంబంధించి సాంకేతిక సందేహాలు ఉంటె వాటిని ఈ మెయిల్ కి పంపండి: technicalquery.covid19[at]gov[dot]in ఇతర సందేహాలను ఈ అడ్రస్ కి మెయిల్ చేయండి :  ncov2019[at]gov[dot]in and @CovidIndiaSeva .

కోవిడ్-19 కి సంబంధించిన సందేహాలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నంబర్ల ద్వారా కూడా నివృతి చేసుకోవచ్చు: +91-11-23978046 or 1075 (Toll--19 పై రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో హెల్ప్ లైన్ నంబర్ల జాబితా ఈ సైట్ లో లభ్యమవుతాయి. 

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

****


(Release ID: 1652324) Visitor Counter : 257