రక్షణ మంత్రిత్వ శాఖ
తూర్పు లడాఖ్ లో తాజా పరిస్థితి
Posted On:
08 SEP 2020 10:49AM by PIB Hyderabad
ఎల్‌ఐసిలో ఉద్రిక్తతలను తగ్గించడానికి,భారత్ కట్టుబడి ఉంటే, చైనా మాత్రం పరిస్థితిని తీవ్రతరం చేయడానికి రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది.
ఏ దశలోనూ కూడా భారత సైన్యం ఎల్‌ఐసి సరిహద్దుల్లో ఉల్లంఘనలను అతిక్రమించకుండా, కాల్పులు వంటి ఉద్రిక్త చర్యలకు వెళ్లకుండా సంయమనం పాటిస్తోంది.
సైనిక, దౌత్య, రాజకీయ స్థాయిలో చర్చలు జరుగుతుండగా, అటు పిఎల్‌ఎ ఒప్పందాలను నిర్లక్ష్యంగా ఉల్లంఘిస్తూ, దూకుడుగా వ్యవహరిస్తోంది.
2020 సెప్టెంబర్ 07 న చోటుచేసుకున్న ఘటనలో, పిఎల్‌ఎ దళాలు ఎల్‌ఐసి వెంట భారత్ లో ముందు ఉన్న పొజిషన్లలో దూసుకురావడానికి ప్రయత్నించాయి, మన దళాలు సమర్థవంతంగా నివారించినపుడు, పిఎల్‌ఎ దళాలు గాలిలో కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాయి. మన దళాలను బెదిరించాయి.
తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలకు ఆ వైపు ఒడిగడుతున్నప్పటికీ, మన దళాలు చాలా సంయమనం పాటించాయి, పరిణతి చెందిన బాధ్యతాయుతమైన రీతిలో ప్రవర్తించాయి.
భారత సైన్యం శాంతి, ప్రశాంతతను కాపాడటానికి కట్టుబడి ఉంది, అయితే ఎటువంటి పరిస్థితుల్లో జాతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం కృతనిశ్చయంతో ఉంది.
వెస్ట్రన్ థియేటర్ కమాండ్ తన ప్రకటన ద్వారా వారి దేశీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.
**********
(Release ID: 1652286)
Visitor Counter : 289
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam