పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు పౌరులతో సమిష్టిగా పనిచేయడమే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పరిష్కారం: శ్రీ ప్రకాష్ జవదేకర్

మొదటి సారిగా పాటిస్తున్న 'అంతర్జాతీయ పరిశుభ్రమైన గాలి స్వచ్ఛమైన వాతావరణంతో కూడిన నీలాకాశ దినోత్సవం' సందర్బంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన 122 అత్యంత కలుషితమైన నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు.

Posted On: 07 SEP 2020 7:33PM by PIB Hyderabad

మొట్టమొదటి అంతర్జాతీయ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా ఒక వెబ్‌నార్‌లో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, అత్యంత కలుషితమైన 122 నగరాల్లో వాయు కాలుష్య స్థాయిని తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వాయు కాలుష్యం సమస్యను నొక్కిచెప్పిన పర్యావరణ మంత్రి 2014 లో ప్రభుత్వం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) పర్యవేక్షణను ప్రారంభించిందని, ప్రస్తుతుకం ఎనిమిది పారామితులపై కాలుష్య స్థాయిలను ట్రాక్ చేస్తున్నామని చెప్పారు.

WhatsApp Image 2020-09-07 at 16.49.32.jpeg

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో వాయు కాలుష్యం సమస్యను ప్రస్తావిస్తూ 100 నగరాల్లో వాయు నాణ్యతను సమగ్రంగా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించడం పట్ల మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మార్పు తీసుకురావడానికి ప్రధానమంత్రి స్వయంగా నిశ్చయించుకున్నారని కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ జవదేకర్ స్పష్టం చేశారు. 

Acceptance of a problem is beginning of the solution. In 2014, we launched AQI monitoring. Now with pan India #CleanAir programme, I am sure we will be able to achieve the goal set by PM @narendramodi ji of Holistic improvement in Air Quality in 100 cities.#CleanAirForBlueSkies pic.twitter.com/RjRlrQ82c9

— Prakash Javadekar (@PrakashJavdekar) September 7, 2020

సహాయ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో, పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆర్పి గుప్తా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి తీసుకునే సమగ్ర చర్యల (ఎన్కాప్) పై ఒక బ్రోచర్ను ప్రారంభించారు. 

On first International Day of #CleanAirForBlueSkies ,launched a brochure on Integrated Measures to Combat #AirPollution under the National Clean Air Programme. The emphasis is on city specific plan in the identified 122 cities.

Join Hands & let's be a solution to Air Pollution! pic.twitter.com/Kq1bGdSgqn

— Prakash Javadekar (@PrakashJavdekar) September 7, 2020

దేశమంతా ఇప్పుడు బిఎస్-VI ప్రమాణాలకు మార్పు చెందడంతో నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ దేశంలో అందించడం జరుగుతోందని, ఇది కాలుష్యానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఒక ముఖ్య చొరవ అని మంత్రి చెప్పారు. గత కొన్నేళ్లుగా రోడ్లు, రహదారులను ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిర్మిస్తోందని, అయినా మునుపటి పరిస్థితులతో పోలిస్తే కాలుష్యం గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు. ప్రతి నగరంలో కాలుష్యానికి భిన్నమైన మూలాలు ఉన్నాయి కాబట్టి, రాష్ట్రాలు ఇప్పుడు నగర నిర్దిష్ట ప్రణాళికలతో పనిచేయాలని మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని పర్యావరణ మంత్రి అన్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఇటుక బట్టీలు వాటి నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడానికి జిగ్ జాగ్ టెక్నాలజీని అవలంబించాలని ఆయన అన్నారు. గాలిని శుభ్రపరచడానికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని కేంద్ర మంత్రి అన్నారు. కార్-పూలింగ్, ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. 

గత ఏడాది జనవరిలో, పర్యావరణ మంత్రిత్వ శాఖ వాయు కాలుష్య సమస్యను సమగ్రంగా పరిష్కరించడానికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సిఎపి) ను ప్రారంభించింది, 2024 నాటికి వాతావరణంలో పిఎమ్(కాలుష్యకారక పదార్థాల ప్రమాణం) 20 నుండి 30 శాతం తగ్గింపును సాధించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. అంతకుముందు ఈ ప్రణాళిక 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో  లక్ష్యాలు సాధించలేని 102 నగరాలను గుర్తించారు. గాలి నాణ్యతపై తాజా డేటా ఆధారంగా ఎన్‌సిఎపి కింద అటువంటి మరో 20 నగరాలు జాబితాలో చేరాయి. 

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్కై ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా నిర్వహించిన ఈ వెబ్‌నార్‌లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల పట్టణ అభివృద్ధి శాఖ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్‌సిఎపి కార్యక్రమంలో గుర్తించిన 122 నగరాల కమిషనర్లు కూడా పాల్గొని వారి అనుభవాలు, ఉత్తమ పద్ధతులను వివరించారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2020 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 07 న ఈ దినోత్సవాన్ని జరుపుకునే తీర్మానాన్ని 2019 డిసెంబర్ 19 న ఆమోదించింది.

                                                                                                                                                             ***


(Release ID: 1652206) Visitor Counter : 216