ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొనసాగుతున్న కోవిడ్-19నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యలో పెరుగుదల
రికార్డు స్థాయిలో ఒకే రోజున కోలుకున్న (రికవరీ) 73, 642 మంది
వరుసగా రెండు రోజులపాటు ప్రతి రోజూ 70 వేలమందికిపైగా రోగుల రికవరీ
Posted On:
06 SEP 2020 1:40PM by PIB Hyderabad
భారతదేశంలో కోవిడ్ -19 నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్యలో పెరుగుదల వరుసగా రెండో రోజున కూడా నమోదైంది. వరుసగా రెండో రోజున కూడా రికార్డు స్థాయిలో 70 వేలమందికి పైగా ( ఒకే రోజులో) కోలుకోవడం జరిగింది.
గత 24 గంటల్లో 73, 642 మంది రోగులు ఐసోలేషన్ నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఇంతవరకూ భారతదేశంలో 32 లక్షల మంది ( 31, 80, 865) వరకూ ఈ మహమ్మారి వైరస్ నుంచి కోలుకోవడం జరిగింది. కోవిడ్ -19నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యలో అనూహ్య పెరుగుదల నమోదు అవుతుండడంతో భారతదేశంలో రికవరీ రేటు మరింతగా పెరిగి 77. 32 శాతానికి చేరుకుంది.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్థిరంగా చేపట్టిన పలు చర్యల కారణంగా ప్రారంభదశలోనే కోవిడ్ -19 రోగులను గుర్తించి చికిత్సలు అందించడం జరుగుతోంది. రోగులను గుర్తించడానికిగాను ఉన్నతస్థాయి పరీక్షలు చేయడం జరుగుతోంది. రోగులను త్వరగా గుర్తించడంవల్ల వారికి సమయానికి ప్రమాణాలతో కూడిన చికిత్స లభిస్తోంది. తద్వారా వెంటనే ఇళ్లలోగానీ, ఆసుపత్రుల్లోను, ప్రత్యేక కేంద్రాల్లోనుగానీ ఐసోలేషన్లో వుంచి చికిత్సలు ఇస్తున్నాం. ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ఏఐఐఎంఎస్ తో కలిసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంద్వారా.. కోవిడ్ ఆసుపత్రుల్లో సేవలందించే ఐసియు వైద్యుల చికిత్సా నైపుణ్యాలను మెరుగుపర్చడం జరుగుతోంది. తద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం. కోవిడ్ నివారణకోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకారణంగా ప్రపంచంలోనే భారతదేశంలో అతి తక్కువ మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాల రేటు మరింత తగ్గి ఈ రోజున ఇది 1.72 శాతంగా నమోదైంది.
అంతే కాదు ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలో ఇంతవరకూ వున్న మొత్తం పాజిటివ్ కేసుల్లో 20.96 శాతం కేసులు మాత్రమే యాక్టివ్ కేసులు ( 8, 62, 320).
కోవిడ్ -19కు సంబంధించి సాంకేతిక అంశాల అధికారిక, తాజా సమాచారం కోసం, మార్గదర్శకాలకోసం
https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA వెబ్ సైట్లను సందర్శించగలరు.
సాంకేతికపరమైన సందేహాలను
technicalquery.covid19[at]gov[dot]in కు మెయిల్ చేయగలరు. ఇతర సందేహాలను ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva పంపగలరు.
కోవిడ్ -19 సందేహాల నివృత్తి కోసం ఫోన్ చేయాల్సిన నెంబర్లు : ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ నెంబర్
+91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ).
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సహాయక విభాగ ఫోన్ నెంబర్లు https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf లో అందుబాటులో వున్నాయి.
***
(Release ID: 1651782)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam