హోం మంత్రిత్వ శాఖ

భారత పొలిసు సర్వీసు (ఐ పి ఎస్) అధికారుల శిక్షణ ముగిసిన తరువాత జరిగే దీక్షఅంత్ పరేడ్ సందర్బంగా 71ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూట్, 2018 బ్యాచ్) ఐ పి ఎస్ అధికారులకు కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా శుభాశీస్సులు తెలిపారు.

ఈ సందర్బంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐ పి ఎస్ అధికారులతో పరస్పరం సంభాషించారు.

ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ "ప్రధానమంత్రి స్ఫూర్తిదాయక ప్రసంగం యువ అధికారుల నైతిక స్థైర్యాన్ని పెంచగలదని, అంతేకాక పొలిసు-ప్రజా సంబంధాలను ఏ విధంగా పటిష్టం చేయాలనే విషయంలో వారికీ మార్గదర్శకంగా ఉండగలదని" శ్రీ అమిత్ షా అన్నారు.

ఈ ఐ పి ఎస్ అధికారులు దేశ భద్రతను మరియు సమగ్రతను కాపాడుతూ అత్యంత అంకిత భావంతో దానికి సేవచేయగలరని ఆశిస్తున్నాను: హోమ్ మంత్రి

"పొలిసు విధుల నిర్వహణ పట్ల వారికి ఉన్న కట్టుబాటు ఐ పి ఎస్ లో చేరేందుకు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలువగలదనే విశ్వాసం నాకుంది" : కేంద్ర హోమ్ మంత్రి


కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా, హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మరియు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్సు ద్వారా పరేడ్ లో పాల్గొన్నారు.

Posted On: 04 SEP 2020 3:10PM by PIB Hyderabad

 హైదరాబాద్  సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్ వి పి ఎన్ పి ఎ)లో శుక్రవారం  71ఆర్ఆర్  (రెగ్యులర్ రిక్రూట్, 2018 బ్యాచ్)  ఐ పి ఎస్ అధికారులకు దీక్షఅంత్ పరేడ్ జరిగింది.   ఈ సందర్బంగా  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐ పి ఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా  పరస్పర సంభాషణలు జరిపారు.  కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా పరేడ్ లో పాల్గొన్నారు.  

    కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ  "ప్రధానమంత్రి స్ఫూర్తిదాయక ప్రసంగం యువ అధికారుల నైతిక స్థైర్యాన్ని పెంచగలదని, అంతేకాక పొలిసు-ప్రజా సంబంధాలను ఏ విధంగా  పటిష్టం చేయాలనే విషయంలో వారికీ మార్గదర్శకంగా ఉండగలదని" శ్రీ అమిత్ షా అన్నారు.    

శిక్షణ ముగింపు పరేడ్ సందర్బంగా యువ ఐ పి ఎస్ అధికారులకు కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా శుభాశీస్సులు తెలిపారు.   "ఈ  
ఐ పి ఎస్ అధికారులు దేశ భద్రతను   మరియు సమగ్రతను కాపాడుతూ  అత్యంత అంకిత  భావంతో  దానికి  సేవచేయగలరని ఆశిస్తున్నాను: పొలిసు విధుల నిర్వహణ పట్ల వారికి ఉన్న కట్టుబాటు ఐ పి ఎస్ లో చేరేందుకు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలువగలదనే విశ్వాసం నాకుంది"  :

ప్రధనమంత్రి మరియు కేంద్ర హోమ్ మంత్రితో పాటు  హోమ్ వ్యవహారాల  శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మరియు  కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ భల్లా  వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా  పరేడ్ లో పాల్గొన్నారు.  

 కేంద్ర హోమ్ మంత్రి గత సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన న్యూఢిల్లీలో ఈ బ్యాచ్ ప్రొబెషనర్లను ఉద్దేశించి ప్రసంగించారు.  ప్రజల క్షేమానికి, భద్రతకు నిరంతరం పాటుపడుతున్న సర్వీసులో చేరినందుకు ఘనంగా భావించాలని ఆయన ప్రొబెషనర్లను ప్రోత్సహించారు.  పోలీసుల గురించి ప్రజలలో సానుకూల దృక్పథం పెంపొందేలా చూడాల్సిన అవసరం ఉందని హోమ్ మంత్రి నొక్కి చెప్పారు.  

పోలీసు అకాడమీలో 28 మహిళా ప్రొబెషనర్లతో పాటు 131 మంది ఐ పి ఎస్ ప్రొబెషనర్లు 42 వారాల మొదటి దశ మౌలిక కోర్సు శిక్షణ పూర్తి చేశారు.  ఐ ఎ ఎస్,  ఐ ఎఫ్ ఎస్ మొదలైన విధులకు ఎంపికైన వారితో పాటు వీరుకూడా ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో మరియు హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హెచ్ ఆర్ డి సంస్థలో  ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసిన తరువాత పోలీసు అకాడమీలో 2018 డిసెంబరు 17వ తేదీన చేరారు.  

ఎస్ వి పి ఎన్ పి ఎ లో మౌలిక కోర్సు శిక్షణలో భాగంగా ప్రొబెషనర్లకు ఆఫీసులో,  బయటా  నిర్వర్తించవలసిన వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణాంశాలలో న్యాయశాస్త్రం,   పరిశోధన,  ఫోరెన్సిక్స్,  నాయకత్వము మరియు యాజమాన్య నిర్వహణ, నేరవిచారణ శాస్త్రం,  ప్రజా భద్రత మరియు ఆంతరంగిక భద్రత, నైతిక విలువలు మరియు మానవ హక్కులు,  ఇండియాలో  ఆధునిక పొలిసు విధుల నిర్వహణ తీరు,  వ్యాయామ విన్యాసాలు మరియు యుక్తులు,  ఆయుధాలు మరియు తుపాకీ కాల్చడంలో  శిక్షణ.  ఉన్నాయి.  

***


(Release ID: 1651442) Visitor Counter : 149