వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దేశం లోని ఎగుమతులు, దిగుమతులు సానుకూల పోకడలను చూపుతున్నాయి, వాణిజ్య లోటు తగ్గుతోంది : శ్రీ పియూష్ గోయల్ వెల్లడి
ఎంఈఐఎస్ కోసం 2 కోట్ల రూపాయల క్యాపింగ్- ఎగుమతిదారులలో 98% మందిని ప్రభావితం చేయదు: శ్రీ గోయల్
ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో మంత్రి భేటీ
Posted On:
04 SEP 2020 10:00AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు వివిధ ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల (ఇపిసిలు) కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. మన దేశంలో జరుగుతున్న ప్రపంచ వాణిజ్యం, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా లాక్ డౌన్ అయినప్పటి నుండి శ్రీ గోయల్ ఇపిసిలతో వరుస చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో వాణిజ్య కార్యదర్శి డాక్టర్ అనుప్ వాధవన్, డిజిఎఫ్‌టి శ్రీ అమిత్ యాదవ్, మంత్రిత్వ శాఖ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశ ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా సానుకూల పోకడలను చూపుతున్నాయని మంత్రి చెప్పారు. మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎగుమతులు బాగా తగ్గిన తరువాత గత సంవత్సరం స్థాయికి చేరుకుంటున్నాయని చెప్పారు. "సానుకూల విషయం ఏమిటంటే, మూలధన వస్తువుల దిగుమతులు తగ్గలేదు, దిగుమతులలో తరుగుదల ప్రధానంగా ముడి చమురు, బంగారం ఎరువులలో కనిపిస్తుంది" అని అన్నారు. వాణిజ్య లోటు బాగా తగ్గుతూ, ప్రపంచ వాణిజ్యంలో మన వాటా మెరుగుపడుతోంది, స్థితిస్థాపక సరఫరా గొలుసులు ఈ పరిణామానికి కారణం. దీనితో పాటు మన ఎగుమతిదారుల పట్టుదల, కృషి విశేషంగా ఉందని ఆయన అన్నారు. మరింత విశ్వసనీయమైన, మెరుగైన వాణిజ్య డేటాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నామని, తద్వారా దేశంలో మంచి ప్రణాళిక, తదనుగుణంగా విధానాలు రూపొందుతాయని మంత్రి అన్నారు.
ప్రపంచ వాణిజ్యం, అనుసంధాన వ్యవస్థలో భారత వాటాను విస్తరించడానికి, కార్యకలాపాల స్థాయి పెంచడానికి, నాణ్యతను మెరుగుపరచడానికి దృష్టిపెట్టాల్సిన 24 తయారీ రంగాలను గుర్తించామని మంత్రి చెప్పారు. ఈ రంగాలకు దిగుమతి ప్రత్యామ్నాయం, ఎగుమతులను పెంచే సామర్థ్యం ఉంది. గ్లోబల్ వాల్యూ చైన్లో భారతదేశం విశ్వసనీయ, స్థితిస్థాపక భాగస్వామిగా ప్రపంచంలో ఒక స్థానం సంపాదించిందని ఆయన అన్నారు.
మర్చండైస్ ఎక్స్ పోర్ట్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎంఇఐఎస్) లో ఇటీవలి మార్పుల అంశంపై మాట్లాడుతూ, రూ. 2 కోట్ల క్యాపింగ్ ఈ పథకం కింద ప్రయోజనం పొందే 98% ఎగుమతిదారులను ప్రభావితం చేయదని మంత్రి స్పష్టం చేశారు.
ఈపిసి ఆఫీసు-బేరర్ల సవాళ్లు, అనుభవాలు మరియు సలహాలను విన్న తరువాత, మంత్రి వారి విలువైన అభిప్రాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మాక్రో-నంబర్లు కొన్నిసార్లు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రహించలేవని అన్నారు. ప్రధానంగా విచక్షణా వ్యయంపై ఆధారపడిన కొన్ని రంగాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని ఆయన అంగీకరించారు. శ్రీ గోయల్ ఎగుమతిదారులకు వీలైనంత వరకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. సెజ్ సమస్యలను ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. భారతీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీతో పాలుపంచుకోవాలని ఆయన ఎగుమతిదారులకు పిలుపునిచ్చారు.
****
(Release ID: 1651292)
Visitor Counter : 791