రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఇంద్ర నేవీ-20 విన్యాసాలు

Posted On: 04 SEP 2020 12:46PM by PIB Hyderabad

భారత్‌-రష్యా సంయుక్త 11వ విడత 'ఇంద్ర నేవీ' విన్యాసాలు ఇవాళ, రేపు బంగాళాఖాతంలో జరుగుతున్నాయి. 2003లో తొలిసారి విన్యాసాలు జరిగాయి. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధానికి గుర్తుగా తరచూ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో, రష్యా ఆహ్వానం మేరకు భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ మాస్కోలో పర్యటిస్తున్నారు. ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరుపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం విజయం 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలోనూ రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొంటారు.

    ఏటికేడూ ఇంద్ర విన్యాసాల స్థాయిని, సంక్లిష్టతను పెంచుతున్నారు. రెండు నౌకాదళాలు ఏళ్ల తరబడి నిర్మించిన అంతఃకార్యాచరణను మరింత బలోపేతం చేయడం, బహుముఖ సముద్ర కార్యాచరణపై అవగహన, విధానాలను మెరుగుపరచడం ఇంద్ర నేవీ-20 ప్రాథమిక లక్ష్యం. కొవిడ్‌ కారణంగా, "భౌతిక సంబంధం లేకుండా, సముద్రంలో మాత్రమే" పద్ధతిలో ఈసారి విన్యాసాలు నిర్వహిస్తున్నారు.


 

 

***

 



(Release ID: 1651241) Visitor Counter : 217