రైల్వే మంత్రిత్వ శాఖ

ముగ్గురు రైల్వే రక్షణ సిబ్బందికి జీవన్ రక్ష మెడల్సును ప్రదానం చేసిన గౌరవ భారత రాష్ట్రపతి

ఒకరికి సర్వోత్తమ జీవన్ రక్షా మెడల్ మరియు ఇద్దరికి ఉత్తం జీవన్ రక్షా మెడల్స్ ప్రదానం

Posted On: 02 SEP 2020 4:29PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ భారతీయ రైల్వే రక్షణ దళం(ఆర్పిఎఫ్) సిబ్బందికి  జీవన్ రక్షా పతకాలను ప్రదానం చేసారు.

1.      సర్వోత్తమ జీవన్ రక్షా పతకం(మరణానంతరం)-కీర్తిశేషులు శ్రీ జగ్బీర్ సింగ్, కానిస్టేబుల్/ఉత్తర రైల్వే

ఢిల్లీలోని ఆదర్శనగర్-ఆజాద్పూర్ రైల్వే సెక్షనుకు దగ్గరలో 4గురు పిల్లల ప్రాణాలను తన ప్రాణాలకు తెగించి కాపాడారు.  అత్యంత పరాక్రమాన్ని ప్రదర్శించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శ్రీ జగ్బీర్ సింగ్ పిల్లల ప్రాణాలను కాపాడారు. అందుకుగాను శ్రీ జగ్బీర్ సింగ్ గారికి మరణానంతరం సర్వోత్తం జీవన్ రక్షా పతకం ప్రదానం చేసారు.

2.    ఉత్తమ జీవన్ రక్షా పతకం- శ్రీ శివచరణ్ సింగ్, కానిస్టేబుల్/పశ్చిమ రైల్వే

10.08.2019న రైలు సంఖ్య 12959లో తన విధులను నిర్వర్తిస్తుండగా  శ్యాంఖయాలి రైల్వే స్టేషన్ దగ్గరలో రైలు పట్టాలపై నీరు నిలిచి పోవడం వలన రైలు ఆగినపుడు  ప్రక్కన వరదల్లో కొంతమంది మనుషులు కొట్టుకుపోవడం గమనించిన శ్రీ శివచరణ్ సింగ్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నీటోకి దూకి 9మంది ప్రాణాలను కాపాడారు.

3.     ఉత్తమ జీవన్ రక్షా పతకం- శ్రీ  ముఖేష్ కుమార్ మీనా, హెడ్ కానిస్టేబుల్/ వాయువ్య రైల్వే

జోధ్పూర్ డివిజన్కు చెందిన ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా  16.08.2018న రైలు సంఖ్య 22478లో తన రక్షణ విధులను నిర్వర్తిస్తుండగా  నడుస్తున్న రైలు నుండి ప్లాట్ఫాంపైకి తన ఇద్దరు పిల్లలతో దిగడానికి ప్రయత్నించిన ఒక మహిళను రక్షించడానికి తన ప్రాణాలను లెక్కచేయకుండా నడుస్తున్న రైలు నుండి ప్లాట్ఫాం పైకి దూకి రైలుకు మరియు ప్లాట్ఫాంకు మధ్యన గల సందులో పడకుండా వారిని లాగి రక్షించారు.

***


(Release ID: 1650665) Visitor Counter : 125