వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

1.9.2020 నుండి 31.12.2020 వరకు చేసే ఎగుమతులపై ఎగుమతిదారులకు అందుబాటులో ఉన్న ఎంఈఐఎస్ ప్రయోజనాలపై ప‌రిమితి

Posted On: 02 SEP 2020 11:17AM by PIB Hyderabad

'మర్చండైస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్' (ఎంఈఐఎస్) కింద ఇప్ప‌టి వ‌ర‌కు అందిస్తున్న రివార్డులపై పరిమితి విధించబడింది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఒక నోటిఫికేష‌న్ జారీ చేయ‌బ‌డింది. డైరెక్టరేట్ జనరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఈ నోటిఫికేష‌న్ జారీ చేశారు. దీని ప్రకారం, ఎంఈఐఎస్ పథకం కింద 1.9.2020 నుండి 31.12.2000  మధ్య కాలంలో చేసే ఎగుమ‌తుల‌పై ఐఈసీ హోల్డర్‌కు మంజూరు చేయగల మొత్తం రివార్డు ఒక్కో ఐఈసీకి రూ.2 కోట్లు మించ‌కుండా ప‌రిమితి విధించారు. దీనికి తోడు 1.09.2020 తేదీ నుంచి సంవత్సరం కాలానికి ముందు గాను ఎటువంటి ఎగుమతులు జ‌ర‌ప‌ని ఐఈసీ క‌లిగిన ఎగుమ‌తిదారులు లేదా సెప్టెంబర్ 1
ఆ తరువాత ఏదైనా కొత్త ఐఈసీలు పొందిన వారు ఎంఈఐఎస్ ప‌థ‌కం కింద క్ల‌యిములు సమర్పించడానికి అర్హులు కాద‌ని ఈ నోటిఫికేష‌న్‌లో స్ప‌ష్టం చేశారు. ఈ ఎంఈఐఎస్ పథకం 1.1.2021వ తేదీ నుంచి ఉపసంహరించబడుతుంది.  1.9.2020 నుండి 31.12.2020 మ‌ధ్య‌ కాలానికి ఎంఈఐఎస్ కింది మొత్తం క్ల‌యిమ్‌లు కూడా ప్రభుత్వం నిర్ధేశించిన‌‌ మొత్తం కేటాయింపులు రూ.5,000 కోట్లకు మించకుండా చూసేందుకు గాను.. రానున్న రోజుల్లో ఈ సీలింగ్‌ను మ‌రింత‌గా త‌గ్గించే అవ‌కాశం ఉంది. తాజా స‌వ‌ర‌ణ‌తో ఎంఈఐఎస్ యొక్క ఎగుమతిదారుల క్ల‌యిమ్‌లలో 98 శాతం ప్రభావితం కావ‌ని అంచనా. ప్రభావితం కాని ఎగుమతిదారులు తమ ఉత్పత్తుల ధరల విషయంలో ఇప్పటికే ఎంఈఐఎస్ ను ప్ర‌తిబింబించిన‌‌ కారణంగా వారు కొత్త‌గా ఎటువంటి మార్పును లేదా అనిశ్చితిని ఎదుర్కోరు. ఎందుకంటే ఉత్పత్తుల కవరేజ్ లేదా ఎంఈఐఎస్ రేట్లు మార్చబడవు. ఎంఈఐఎస్ ముగింపు తేదీ గురించి 4 నెలల ముందస్తు నోటీసు జారీ చేయ‌డం.. భవిష్యత్ ధరల‌ నిర్ణయానికి త‌గిని విధంగా క‌చ్చితత్వాన్ని అందిస్తుంది.


 

*****



(Release ID: 1650620) Visitor Counter : 253