గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

జీవనోపాధి అవకాశాలను కల్పిస్తూ, గ్రామీణుల సాధికారతకు బాటలు వేస్తున్నగరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ - లబ్ధిదారుల విజయగాధలు

Posted On: 01 SEP 2020 3:17PM by PIB Hyderabad

కోవిడ్-19 దేశాన్ని అతలాకుతలం చేసింది ముఖ్యంగా గ్రామీణ భారతం, వలస కార్మికులకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ (జికేఆర్ఏ) వారికి ఒక ఆశాదీపం అయింది. గ్రామాలకు తిరిగి చేరుకుంటున్న వలస కార్మికులకు జీవనోపాథి అవకాశాలు కల్పించడానికి ఈ పథకం ప్రారంభించారు. దేశంలోని ముఖ్యంగా 6 రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లే వలస కార్మికుల కు జీవనోపాధి కల్పించడం కోసం అభియాన్  నిర్దిష్ట లక్ష్యంతో, నిర్దిష్ట సమయంలో విస్తృతంగా చర్యచేపట్టింది. ఆ రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో తిరిగి వచ్చిన వలస కార్మికులకు అభియాన్ కార్యక్రమం భరోసాగా నిలిచింది. 

12 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు సమ్మిళత కృషితో  చేసిన ప్రయత్నం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులకు అత్యంత లబ్ది  చేకూరుస్తోంది. ఇందులో భాగంగా లబ్దిదారులకు సంబంధించిన ఈ రెండు విజయగాధాలను తెలుసుకుందాం. గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్  కింద వారికి గృహాలను నిర్మించి ఇచ్చారు. 

1. రాష్ట్రం : ఒడిశా 

లబ్ధిదారుని వివరాలు 

పేరు: సాషి బారిక్ 

గ్రామం: తేబాడుంగురి ; గ్రామా పంచాయతీ: హీరాపూర్, బ్లాక్: లోసింగ, జిల్లా: బలంగీర్ 

COVID-19 సందర్బంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పుడు, సాషి బారిక్ తన ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీనిని పీఎంఏజివై-జి  కింద గతంలో మంజూరు చేశారు. ఊహించని లాక్ డౌన్ దృష్టిలో పెట్టుకుని నిర్మాణ సామగ్రిని, పనివారిని సమీకరించడానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. ఫలితంగా, మొదటి విడత సాయం అందుకున్న ఒక నెలలోనే సాషి అన్ని విధాలుగానూ ఇంటిని పూర్తి చేయగలిగారు.

“ఇప్పుడు మేము సంతోషంగా సిమెంట్ కాంక్రీట్ ఇంట్లో నివసిస్తున్నాము. పక్కా ఇల్లు నిర్మించడానికి మా లాంటి పేద కుటుంబాలకు సహకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఈ ఇంటి యజమాని అయినందుకు గర్విస్తున్నాను” అని బాలంగీర్ జిల్లాలోని లోయిసింగ్ బ్లాక్ పరిధిలోని హిరాపూర్ గ్రామ పంచాయితీలో తేబాడుంగురి గ్రామంలో శిధిలమైన ఇంట్లో నివసిస్తున్న ఈ 80 ఏళ్ల వితంతువు సాషి బారిక్ ఆనందంతో చెప్పారు. ఆమె కొడుకు దినసరి వేతన కార్మికుడు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో అతి కష్టం మీద 5గురు సభ్యులున్న ఆ కుటుంబం రెండు పూట్ల భోజనం చేస్తుంది. పక్క ఇల్లు అనేది వారికి ఒక సుదూర కల. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ.1,35,000/- సహాయం చేసింది. ముందుగానే ఇంటి నిర్మాణం పూర్తి చేసినందుకు ప్రభుత్వం రూ.20,000/- ప్రోత్సాహం కూడా ఇచ్చింది. 

 

http://awaassoft.nic.in/mobile/mphotop/OR/OR4160180--2-16-6-2020%20045124.jpeg

 

 

 

 

 

 

 

 

                                                  

2. రాష్ట్రం: జార్ఖండ్ 

లబ్ధిదారుని వివరాలు 

పేరు: దూలరి మసోమాత్ 

గ్రామం: హురుదగ్ ; గ్రామా పంచాయతి : బేస్; బ్లాక్:కట్కందగ్ ; జిల్లా: హజారీబాగ్ 

శ్రీమతి దులారి మసోమాట్ భర్త 2008 సంవత్సరంలో మరణించారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. భర్త మరణించిన తరువాత, తన కుమార్తెలను పెంచే బాధ్యత మొత్తం ఆమె భుజాలపై పడింది. ఆమె తన కుటుంబాన్ని చూసుకోవటానికి రోజువారీ కూలీ కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె ఇల్లు శిథిలావస్థలో ఉంది. 2019-20 సంవత్సరంలో, పిఎంఎవై-జి కింద ఇల్లు నిర్మాణానికి ఆమెకు పథకం మంజూరు అయింది. జికేఆర్ఏ కింద, ఆమె తన సొంత శ్రమతో తన ఇంటిని నిర్మించుకుని చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ సహకారంతో తాను మరుగుదొడ్డిని కూడా నిర్మించానని, వంట గ్యాస్ కనెక్షన్ లభించిందని చెప్పారు. ఇప్పుడు ఆమె తన కుటుంబానికి మెరుగైన జీవన పరిస్థితులను అందించగలుగుతోంది.

 

 

 

 

 

 

***


(Release ID: 1650573) Visitor Counter : 295