రైల్వే మంత్రిత్వ శాఖ

'డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పోరేషన్‌ ఇండియా లిమిటెడ్‌' ‍(డీఎఫ్‌సీసీఐఎల్‌) పురోగతిపై రాష్ట్రాల అధికారులతో

సమీక్షించిన రైల్వే, వాణిజ్యం&పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్

సమీక్షలో పాల్గొన్న బిహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ అధికారులు; సమస్యల పరిష్కారంపై భరోసా

ప్రాజెక్టు పనులకు న్యాయపర ఇబ్బందులు ఎదురైతే మధ్యవర్తిత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని, చట్టాన్ని అమలు చేయాలని కోరిన రాష్ట్రాలు

పరిష్కార ప్రక్రియలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని విజ్ఞప్తి

ప్రాజెక్టును వేగవంతం చేయాలని సంబంధిత రాష్ట్రాలకు ఇప్పటికే లేఖలు రాసిన మంత్రిత్వ శాఖ
ప్రాజెక్టు పురోగతిపై ప్రతి వారం పర్యవేక్షణ

Posted On: 01 SEP 2020 6:36PM by PIB Hyderabad

రైల్వే, వాణిజ్యం&పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్, 'డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌' (డీఎఫ్‌సీ) వెళ్లే రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. రైల్వే శాఖ, డీఎఫ్‌సీసీఐఎల్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    తూర్పు డీఎఫ్‌సీ (1856 కి.మీ.), పశ్చిమ డీఎఫ్‌సీ (1504 కి.మీ.)లోని అన్ని సెక్షన్లలో పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌సీసీఐఎల్‌ ఉన్నతాధికారులు, రాష్ట్రాలను కేంద్ర మంత్రి ఆదేశించారు. ప్రతి రాష్ట్రంలో పనుల పురోగతిపై సవివరంగా చర్చ జరిగింది. సమస్యలను పరిష్కరించి, సాఫీగా పనిని జరిపించేలా రాష్ట్రాలకు సూచనలు ఇచ్చారు.
    
    భూ సేకరణ పురోగతి, ఆర్‌వోబీల నిర్మాణంపైనా చర్చ జరిగి, వాటి సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రాజెక్టు పనులకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురైతే మధ్యవర్తిత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని, చట్టాన్ని అమలు చేయాలని 
రాష్ట్రాలు గోయల్‌ను కోరాయి.

    ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు, అవసరమైతే రాష్ట్రాధికారులతో రోజూ సమీక్ష నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అన్ని విభాగాల పనితీరుపై గట్టి పర్యవేక్షణ ఉండాలని కూడా నిర్ణయించారు.

    భారత ప్రభుత్వం చేపట్టిన భారీ రైల్వే మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో 'డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌' ఒకటి. దీని పొడవు 3360 కిలోమీటర్లు. వ్యయం 81,459 కోట్ల రూపాయలు. ప్రాజెక్టు ప్రణాళిక, అభివృద్ధి, ఆర్థిక వనరులు, నిర్మాణాలు, నిర్వహణను చూసుకోవడానికి ప్రత్యేకంగా 'డీఎఫ్‌సీసీఐఎల్'ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 

****



(Release ID: 1650571) Visitor Counter : 152