రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

తూర్పు లద్దాఖ్‌లో తాజా పరిస్థితి

Posted On: 31 AUG 2020 10:35AM by PIB Hyderabad

చైనా మరోమారు వక్రబుద్ధిని ప్రదర్శించింది. గతంలో కుదిరిన సైనిక, దౌత్యపర ఒప్పందాలను తుంగలో తొక్కి తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనా బలగాలు మళ్లీ మోహరించాయి. సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నించడంతోపాటు, భారత సైన్యాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించాయి. ప్యాంగాంగ్‌ సరస్సు దక్షిణ ఒడ్డున ఈనెల 29/30వ తేదీ రాత్రి ఈ సంఘటన జరిగింది. దీనిని భారత దళాలు దీటుగా ఎదుర్కొన్నాయి. భూ సరిహద్దు మార్పులను అడ్డుకోవడంతోపాటు, పహారాను మరింత బలోపేతం చేశాయి. చర్చల ద్వారా శాంతిని సాధించడానికి భారత్‌ కట్టుబడి ఉంది, అదే సమయంలో ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి దేనికైనా సంసిద్ధంగా ఉంది. ప్రస్తుత సమస్యను పరిష్కరించేందుకు చూషుల్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరుగుతున్నాయి.

***(Release ID: 1650022) Visitor Counter : 334