ప్రధాన మంత్రి కార్యాలయం

ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్ యాప్ ఇన్నొవేష‌న్ ఛాలెంజ్‌లో అభివృద్ధి చేసిన యాప్‌ల‌ను మ‌న్ కీ బాత్ ప్ర‌సంగంలో ప్ర‌శంసించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

Posted On: 30 AUG 2020 3:11PM by PIB Hyderabad

 

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ చేసిన మ‌న్ కీ బాత్ తాజా ప్ర‌సంగంలో , దేశ యువ‌త ఉత్సాహ‌వంతంగా ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ యాప్ ఆవిష్క‌ర‌ణ‌ల స‌వాలులో పాల్గొన్న‌ట్టు చెప్పారు. ఇందులో మూడింట రెండు వంతుల ఎంట్రీలు ద్వితీయ‌, తృతీయ శ్రేణి న‌గ‌రాల కు చెందిన యువ‌త నుంచి వచ్చిన వే న‌ని ఆయ‌న అన్నారు. వివిధ కేటగిరీల కింద సుమారు రెండు డ‌జ‌న్ల యాప్‌ల‌కు అవార్డులు ప్ర‌క‌టించారని చెప్పారు.ఈ యాప్‌ల వాడుక‌, ఉప‌యోగంపై అవ‌గాహ‌న పెంచుకొని వాటితో అనుసంధానం కావ‌ల‌సిందిగా  ప్ర‌ధాన‌మంత్రి శ్రోత‌ల‌ను కోరారు.
ప్ర‌ధాన‌మంత్రి వీటిలో ప‌లు యాప్ ల గురించి ప్ర‌స్తావించారు. అవి, కుటుకి కిడ్స్ లెర్నింగ్ యాప్ ఒక‌టి. ఇది  పిల్ల‌ల‌కు పనికి వ‌చ్చే ఒక ఇంట‌రాక్టివ్ యాప్‌.  మ‌రో యాప్ కు కూ కు ఇది మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారం. చింగారి యాప్ ఇది యువ‌త‌లో మ‌రింతగా పాపుల‌ర్ అవుతున్న‌ది. ఆస్క్ స‌ర్కార్ యాప్ అనేది  ఏ ప్ర‌భుత్వ ప‌థ‌కానికి సంబంధించిన వివ‌రాల‌నైనా అంద‌జేస్తుంది. అలాగే స్టెప్ సెట్ గో అనేది ఫిట్ నెస్ యాప్‌.
ఇవాళ ఒక చిన్న స్టార్ట‌ప్‌గా ప్రారంభ‌మైన ప్ర‌స్థానం, రేపు ఒక పెద్ద కంపెనీగా మార‌వ‌చ్చ‌ని  ప్ర‌ధాని అన్నారు. ఇవి ప్ర‌పంచంలో భార‌తీయ మార్కుగా నిల‌బ‌డ‌నున్నాయ‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో పెద్ద కంపెనీలుగా ఉన్న‌వి, ఒక‌ప్పుడు స్టార్ట‌ప్‌లేన‌ని మ‌ర‌చిపోరాద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

***



(Release ID: 1649861) Visitor Counter : 163