ప్రధాన మంత్రి కార్యాలయం

ఒక పెంపుడు శునకాన్ని పెంచుకోవాలని ఇప్పటి నుండీ మీరు ఆలోచిస్తూ ఉంటే గనక ఒక భారతీయ జాతి కి చెందిన శునకాన్ని ఇంటికి తెచ్చుకోండి అంటూ ‘మన్ కీ బాత్’ లో సూచన చేసిన ప్రధాన మంత్రి

Posted On: 30 AUG 2020 3:14PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘మ‌న్ కీ బాత్’ (మనసు లో మాట) ధారావాహిక కార్యక్రమం లో భాగం గా ఈ రోజు న చేసిన తాజా ప్ర‌సంగం లో, సైనిక దళం ప్రధానాధికారి ‘ కమెండేశన్ కార్డ్స్ ’ బహుమానాన్ని సంపాదించిన భారత సైన్యాని కి చెందిన శునకాలు సోఫీ ని గురించి, ఇంకా విదా ను గురించి మాట్లాడారు.  
అసంఖ్యాకమైన బాంబు పేలుళ్ల ను, ఇంకా ఉగ్రవాద కుతంత్రాల ను నిష్ఫలం చేయడం లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ను పోషించిన ఆ కోవ కు చెందిన సాహసిక శునకాలు సాయుధ దళాల్లోను, భద్రత దళాల్లోను అనేకం గా ఉన్నాయి అని ఆయన అన్నారు.  మందుగుండు సామాను ను, ఇంకా ఐఇడి ని వాసన ను చూసి పసిగట్టడం లో సాయపడ్డ శునకాల ను గురించిన ఇతర అనేక ఉదాహరణల ను కూడా ఆయన చెప్పారు.  అలాగే, బీడ్ కు చెందిన రక్షక భట విభాగం 300 కు పైగా కేసుల ను పరిష్కరించడం లో సాయపడిన తమ శునకం రాకీ కి పూర్తి గౌరవం తో తుది వీడుకోలు ను చెప్పిన సంగతి ని కూడా ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. 

భారతదేశం జాతి కి చెందినటువంటి శునకాల ను గురించి ప్రధాన మంత్రి చర్చిస్తూ, వాటి ని పెంచడం కోసం అయ్యే ఖర్చులు తక్కువ గా ఉంటాయని, ఇంకా అవి భారతీయ వాతావరణానికి మరియు పరిసరాల కు మెరుగైన రీతి లో అలవాటు పడతాయని, మరి మన సెక్యూరిటీ ఏజెన్సీ లు కూడా ఈ భారత జాతి పెంపుడు శునకాల ను వాటి భద్రత దళం లో ఒక భాగం గా చేర్చుకొంటున్నట్లు చెప్పారు.  భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి భారత జాతి శునకాల పైన పరిశోధన కూడా చేస్తోందని, వాటిని మరింత మెరుగైన విధం గాను, మరింత ప్రయోజనకరం గాను మలచాలనేదే ఈ పరిశోధన ఉద్దేశమని ఆయన వెల్లడించారు.   ‘మనసు లో మాట’ కార్యక్రమ శ్రోతల లో ఒక పెంపుడు శునకాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తున్న వారి ని భారత జాతికి చెందిన శునకాన్ని పెంచుకోవలసిందిగా ప్రధాన మంత్రి ఉద్బోధించారు.  

https://youtu.be/VrpHC5H_5O4
 

***



(Release ID: 1649850) Visitor Counter : 148