ప్రధాన మంత్రి కార్యాలయం
ఓనం అంతర్జాతీయ పండగగా మారుతోందని, మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 AUG 2020 3:08PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఓనం పండుగ గురించి ప్రస్తావించారు. ఈ పండుగ చింగం నెలలో వస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారని, తమ ఇళ్లను అందంగా అలంకరించుకుంటారని పూకలమ్ తయారు చేసుకుంటారని, ఓనమం -సాదియ తో ఆనందిస్తారని ఆయన అన్నారు.
ఒనం పండుగ ఇప్పుడు అంతర్జాతీయ పండుగగా మారుతున్నదని, ఓనం స్ఫూర్తి దూర ప్రాంతంలోని విదేశాలకు కూడా చేరిందని ఆయన అన్నారు.
ఓనం వ్యవసాయంతో ముడిపడిన పండుగ అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక కొత్త ప్రారంభంగా ఉంటుందని ఆయన అన్నారు. రైతులకు గల ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యమే సమాజానికి జీవనోపాధి కల్పిస్తున్నదని ఆయన అన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులు పంట సాగును పెంచారని అన్నారు. అన్నదాతను వేదాలు కూడా ప్రస్తుతించాయని ఆయన ఈ సందర్బంగా గుర్తుచేశారు. రైతుల కృషికి శాల్యూట్ చేస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
***
(रिलीज़ आईडी: 1649783)
आगंतुक पटल : 141
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam